3 Women: ఇంటి పెద్ద దూరమయ్యాడన్న మనోవేదనతో ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తాము చనిపోతూ కూడా ఇతరుల గురించి ఆలోచించింది. సూసైడ్ నోట్‌లో తమ గురించి కాకుండా ఇంట్లోకి వచ్చే వారి సేఫ్టీ గురించి రాసుకొచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీ, వసంత విహార్‌కు చెందిన ఓ ఫ్లాట్లో 50 ఏళ్ల మంజు తన ఇద్దరు కూతుళ్లు అన్షిక, అంకులతో నివాసం ఉంటోంది. కరోనా సమయంలో ఇంటి పెద్ద మరణించాడు. ఇక అప్పటినుంచి వారు మనోవేదనతో గురవుతున్నారు. మంజు సైతం ఆరోగ్యం బాగోలేక బెడ్‌కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
ఇందుకోసం దారుణమైన ప్లాన్ వేసుకున్నారు. ఇంట్లోని అన్ని డోర్స్ మూసేశారు. ఓ చోట బొగ్గులతో పొగ వచ్చేలా నిప్పురాజేశారు. ఆ తర్వాత వంట గదిలోని గ్యాస్ సిలిండర్లనన్నింటిని ఆన్ చేసి పెట్టారు. దీంతో రెండు కలిసి కార్బన్ మోనాక్సైడ్ తయారైంది. ఇళ్లు మొత్తం ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్‌తో నిండిపోయింది. దీంతో వారు ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని గ్యాస్ బయటకు పోయేలా తలుపులు తెరిచారు. ఒకే చోట పడిఉన్న ముగ్గురి శవాలను గుర్తించారు.
పోలీసులకు ఇంట్లో ఓ చోట సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్‌లో రాసున్నది చదవి పోలీసులే ఆశ్చర్యపోయారు. ‘‘ ఇంట్లో ప్రాణాలు తీసే కార్బన్ మోనాక్సైడ్ ఉంది. అది మండుతుంది. ఇంట్లోని తలుపులు మొత్తం తెరవండి. అగ్గిపెట్టెలు, కొవ్వత్తి వెలిగించవద్దు. కర్టెన్ తీసేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇంటినిండా ప్రమాదకరమైన గ్యాస్ ఉంది. దాన్ని పీల్చొద్దు’’ అని రాసుంది. పోలీసులు మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీఅభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!