2 Young Girls: యువతుల మద్యం మత్తు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సదరు యువతులు ర్యాష్ డ్రైవింగ్ చేయటంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హరియాణా అంబాలాకు చెందిన ఇద్దరు యువతులు మద్యం నడిపి రేంజ్ రోవర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. కారు ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతోంది. మోహ్డా ధాన్యం మార్కెట్ దగ్గరకు రాగానే రోడ్డు పక్క ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న మోహిత్ శర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్య దీప్తితో పాటు ఇద్దరు కుమార్తెలు గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువతులు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. ఎస్సై పైనే దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : MLC Anantha Babu: డ్రైవర్ హత్య కేసు.. పోలీసుల అదుపులో MLC అనంత బాబు