ఆడవాళ్లు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. కుటుంబం విషయంలో కావచ్చు.. కర్తవ్య నిర్వహణ విషయంలో కావచ్చు.. వారు చూపించే తెగువ అద్బుతం. తాజాగా, ఓ ఇద్దరు మహిళా పోలీసులు బ్యాంక్ దొంగతనాన్ని అడ్డుకున్నారు. తుపాకులతో ఉన్న దొంగలతో ప్రాణాలకు తెగించి పోరాడి మరీ విజయం సాధించారు. దొంగలను అక్కడినుంచి తరిమి కొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బిహార్ రాష్ట్రం.. హజిపూర్, సెందురాయ్ చౌక్‌లో ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో జుహి కుమారి, శాంతి కుమార్‌లు సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బుధవారం బ్యాంకు పని వేళల్లో ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వీరిని చూడగానే జుహికి అనుమానం వచ్చింది. ‘‘ మీకు బ్యాంకులో ఏమైనా పని ఉందా?’’ అని అడిగింది. దీనికి వారు ‘‘ అవును పని ఉంది’’ అన్నారు. ‘‘ మీ బ్యాంకు పుస్తకాలను చూపించండి!’’ అని అడిగింది. దీంతో వారు తమ దగ్గర ఉన్న పిస్తోల్‌ను బయటకు తీశారు. వెంటనే జుహి, శాంతిలను భయపెట్టి వారి దగ్గర ఉన్న తుపాకులు లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే, దొంగల ప్రయత్నాన్ని ఆ ఇద్దరు మహిళా పోలీసులు తిప్పి కొట్టారు. సివంగుల్లా వారి మీదకు దూకారు. ప్రాణాలకు తెగించి వారితో పోరాడారు.
గాయాలైనా కూడా వెనక్కు తగ్గలేదు. మహిళా పోలీసుల ధైర్యానికి దొంగలు భయపడి పోయారు. వారిని ఎదుర్కోవటం వల్ల కాదన్న సంగతి అర్థం చేసుకున్నారు. అక్కడినుంచి పరుగులు పెట్టారు. జుహి వారిపై కాల్పులు జరపాలనుకుంది. కానీ, అలా చేయలేదు. దొంగలు అక్కడినుంచి మాయం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్స్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ధైర్య సాహసాలను మెచ్చి రివార్డును ప్రకటించారు. మరి, తమ ధైర్య సాహసాలతో దొంగలకు చుక్కులు చూపించిన ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Watch: How 2 Women Cops Stopped Bank Robbery In Bihar https://t.co/XxqXdbUyQj pic.twitter.com/GbfRmQIrO6
— NDTV (@ndtv) January 19, 2023