crime news: 17 ఏళ్ల ఓ అమ్మాయిని 12 ఏళ్ల ఓ బాలుడు తల్లిని చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 17 ఏళ్ల యువతి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతిని రాజా మీరసుదార్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె 9 నెలల కడుపుతో ఉందని తేల్చారు. కూతురు కడుపుతో ఉందని తెలిసిన యువతి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. అదే రోజున బాలిక ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై తల్లిదండ్రులు యువతిని ప్రశ్నించారు. కడుపునకు కారణం ఎవరని అడిగారు.
తనకు కడుపు రావటానికి 12 ఏళ్ల ఓ బాలుడు కారణమని ఆ యువతి చెప్పింది. ఆమె చెప్పింది విని తల్లిదండ్రులు మరోసారి షాక్ అయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బాలుడిపై ఫిర్యాదు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం జువెనల్ హోమ్‌కు తరలించారు. అయితే, బాలిక తల్లి కావటానికి ఆ బాలుడే కారణమా లేక వేరెవరైనా కారణమా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గర్భంతో ఉన్న సంగతి కూడా తెలియకుండా సదరు యువతి, తల్లిదండ్రులు ఇన్ని రోజులు ఎలా ఉన్నారన్న దానిపై కూడా విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ల్యాప్ టాప్ పేలిన ఘటనలో గాయపడ్డ యువతి మృతి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.