Crime News: దేశ వ్యాప్తంగా ఇసుక కొరత ఎక్కువయిపోయింది. సామాన్య జనానికి ఇసుక దొరకటం చాలా కష్టంగా మారింది. అక్రమార్కులు ఇసుకను దోచుకుని దాచుకుంటున్నారు. తమ కిష్టం వచ్చిన రేట్లకు ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమకు కోట్లు కురిపిస్తున్న ఇసుక స్మగ్లింగ్ కోసం దేనికైనా సిద్ధం అంటోంది ఇసుక మాఫియా. ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తిస్తోంది. తాజాగా, ఇసుక స్మగ్లర్లు టోల్‌గేట్ వద్ద భీభత్సం సృష్టించారు. టోల్‌గేట్‌ను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లను పరుగులు పెట్టించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలోని కొందరు ఇసుక స్మగ్లర్లు ఆదివారం రాత్రి భారీగా ఇసుకను దొంగిలించారు. దాదాపు 12 ట్రాక్టర్లలో ఇసుకను నింపుకున్నారు. ఇక, స్మగ్లర్లు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ముందు ఓ టోల్‌గేట్ ఉంది. ఆ టోల్‌గేట్ వద్ద ట్రాక్టర్లు ఆపితే పట్టుబడతామని స్మగ్లర్లు భావించారు. అక్కడ ట్రాక్టర్లు ఆపకుండా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. అనుకున్న దాని ప్రకారమే టోల్‌గేట్ దగ్గరకు రాగానే ట్రాక్టర్ల వేగాన్ని పెంచారు. బూత్ నెంబర్ 2లోని బ్యారికేడ్‌ను ధ్వంసం చేస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఒక ట్రాక్టర్ తర్వాత మరో ట్రాక్టర్.. ఇలా 12 ట్రాక్టర్లు ముందుకు దూసుకెళ్లిపోయాయి.
టోల్‌గేట్ సిబ్బంది వాటిని ఆపటానికి ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. కర్రలతో కొట్టి ఆపుదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ బూత్‌లోని కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఇసుక స్మగ్లర్ల బరితెగింపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
12 ఇసుక ట్రాక్టర్లు టోల్‌గేట్ దగ్గర బారికేడ్లను ధ్వంసం చేస్తూ వేగంగా దూసుకెళ్లాయి. #TollPlaza #agra #tractor pic.twitter.com/UgriDD1Z89
— BBC News Telugu (@bbcnewstelugu) September 5, 2022
ఇవి కూడా చదవండి : ఫస్ట్ నైట్ రోజు టార్చర్ పెట్టిన భార్య! కాపురం చేయలేనని చేతులెత్తేసిన భర్త!