TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగిసిపోకముందే తాజాగా తెలంగాణలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరో కాదు.
తెలంగాణలో ఇటీవల కాలంలో TSPSC పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో నిర్వహించాల్సిన పలు పరీక్షలను సైతం TSPSC వాయిదా వేసింది. ఈ ఘటనను ప్రభుత్వం కాస్త సీరియస్ గా తీసుకుని సిట్ ను ఏర్పాటు చేసి వేగంగా విచారిస్తోంది. ఇక ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో టెన్ట్ పరీక్ష పేపర్ లీక్ కలకలం సృష్టించింది.
జిల్లాలోని తాండూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు ఇంకా 30 నిమిషాల సమయం ఉందన్న క్రమంలోనే ప్రశ్నా పత్రం వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమిచ్చింది. అయితే మొదట్లో ఈ పేపర్ ను సోషల్ మీడియాలో చూసిన అధికారులు ఇది ఫేక్ అంటూ కొట్టి పారేశారు. తీరా పరీక్ష ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన పేపర్ ను, పరీక్ష పేపర్ చూడగా.. రెండూ ఒకేలా కనిపించాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు స్కూల్ లో విచారించగా.. తాండూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బందెప్ప మొబైల్ నుంచి లీక్ అయినట్లుగా అధికారులు, పోలీసులు గుర్తించారు.
అనంతరం పోలీసులు పేపర్ లీక్ చేసిన బందెప్పతో పాటు మండలం విద్యాశాధికారి వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో భాగంగా ముగ్గురుని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ పేపర్ లీక్ కు కారణమైన వారిని కఠినంగా శిక్షించి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారుతోంది. టెన్త్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
తాండూరు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ బైటికి వెళ్లిన ఘటనలో ముగ్గురు సస్పెండ్. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, మరోకరిపై వేటు.
ఇన్విజిలేటర్ బందప్ప మీద గతంలోను ఆరోపణలు. 2017లో బందప్ప మీద పోక్సో కేసు ఉంది. pic.twitter.com/rMYrtMcEJ5
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2023