యూట్యూబ్ ఎప్పటికప్పుడు గైన్ లైన్స్ ని అప్ డేట్ చేస్తా అట్నుండి. తాజాగా మరోసారి యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ ని తీసుకొచ్చింది. గైడ్ లైన్స్ ని చూస్తుంటే.. ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుంది. ఇప్పటివరకూ వేసిన వేషాలు చాలు, ఇక నుంచైనా మీ పిల్ల ఆటలు కట్టిపెట్టి యూట్యూబ్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా వీడియోలను అప్ లోడ్ చేయమని సెలవిచ్చింది. కంటెంట్ కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసేలా ఉండాలని యూట్యూబ్ నిర్ణయించింది. ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న నీలి రంగు కళాఖండాలని ఖండించినట్టే.. ఇప్పుడు బూతు కంటెంట్, బూతు డైలాగులు, అశ్లీల వీడియోలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా వీడియోలు అప్ లోడ్ చేస్తే ఇక మీ వీడియోలు మానిటైజేషన్ కావు. అంటే మీరు బూతు కంటెంట్, అశ్లీల కంటెంట్, ఇబ్బందికర వీడియోలు వంటివి అప్ లోడ్ చేస్తే డబ్బులు రావు అని యూట్యూబ్ ఖచ్చితంగా చెప్పింది. మరి కొత్తగా యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ గైడ్ లైన్స్ ఏంటో చదివేయండి.
అంతేకాదు డిస్ హానెస్ట్ బిహేవియర్ గైడ్ లైన్ కింద కూడా కొత్త గైడ్ లైన్ ని తీసుకొచ్చింది యూట్యూబ్. రీటెయిల్ స్టోర్ యజమాని అనుమతి లేకుండా వీడియోల్లో నటించడం లేదా బిజినెస్ సమయాల తర్వాత కూడా అక్కడే ఉండి చేసే వీడియోలకు ప్రకటనల ఆదాయం రాదు. కాంపిటీటివ్ ఈ-స్పోర్ట్స్ లో హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ ని వాడడం, ప్రోత్సహించడం లాంటివి చూపించే వీడియోలకు ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం ఉండదు. గేమింగ్ ఛానల్ నడిపే వారికి కూడా యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ సహా ఈ మధ్య ఎక్కువ మంది కామన్ గా వాడే ఫ, వాట్ ద ఫ వంటి పదాల విషయంలో యూట్యూబ్ కొన్ని ఆంక్షలు పెట్టింది. గేమ్ ప్లే వీడియోల్లో వాయిస్ ఇచ్చే వ్యక్తులు ఫ అనే లెటర్ తో మొదలయ్యే బూతు పదం వాడితే యాడ్ రెవెన్యూ రాదు. అదే పనిగా వీడియో మొత్తం ఈ పదాన్ని వాడకూడదు.