ఇల్లు కట్టుకోవాలన్నది మీ కలా..? ఎక్కువ స్థలం లేదా..? అయినా ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. 80 గజాల స్థలం ఉన్నా చాలు అద్భుతంగా ఇల్లు కట్టుకోవచ్చు. అది కూడా తక్కువ ఖర్చుతో.. ఎంతో ఆకర్షణీయంగా. అదెలా అనుకుంటున్నారా..? అయితే కింద చదివేయండి.
తమకంటూ సొంతిళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసం రూపాయి.. రూపాయి .. దాస్తూ అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఆ కల.. ఓ కలగానే మిగిలిపోతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణే భారంగా మారిన ఈరోజుల్లో ఇల్లు అన్నది భవిష్యత్ ఆలోచనగానే మారింది. అలాంటి ఈరోజుల్లో తక్కువ ఖర్చుతో నిర్మించిన ఓ డూప్లెక్స్ ఇల్లు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 80 చదరపు గజాల్లోనే దీన్ని నిర్మించారు. అందులోనూ ఈ ఇంటి నిర్మాణం రూ.40 లక్షల్లోపే పూర్తికావడం గమనార్హం. ఈ ఇంటిని చూశాక మీకు ఇలాంటి ఆలోచన తప్పకుండా వస్తుంది.
ఇల్లు కట్టాలని ఆలోచన ఉన్నా మొదలు పెడదామంటే మొదట ‘జాగా’ కావాలి. అందుకోసం ఎంతలేదన్నా 100 నుంచి 150 చదరపు గజాల స్థలం అవసరం. అదే విశాలంగా ఉండాలనుకుంటే 200 చదరపు గజాలు కావాలి. ఈరోజుల్లో 200 గజాల స్థలం కొనాలంటే ఉన్న ఆస్తులు అమ్మాల్సిందే. కానీ అందుకు ఓ ప్రత్యామ్న్యాయం దొరికింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేవలం 80 చదరపు గజాల్లోనే అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ ని నిర్మించుకున్నారు. ఈ ఇంటిని చూడడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. హాల్, లివింగ్ రూమ్, కిచెన్.. వీటిని ఎంతో విశాలంగా కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఆ డిజైన్లు అయితే హైలెవెల్ అంతే. ఇక ఈ నిర్మాణంలో చెప్పుకోవాల్సింది.. వుడెన్ థీమ్ వర్క్, లైటింగ్. ఈ రెండింటి వల్లఇంటి లుక్ మారిపోయిందని చెప్పాలి. ఎక్కడా కూడా కాసింత ప్లేస్ కూడా వృధా అవ్వకుండా అద్భుతంగా కట్టారు.
ఇక ఈ ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు విషయానికొస్తే.. రూ.40 లక్షలు మాత్రమే. ప్రస్తుత మేస్త్రీ కూలీలు రేట్లు, ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలను చూస్తే రూ.40 లక్షల ఖర్చుతో సింగిల్ బెడ్ రూమ్ కట్టడం కూడా కష్టమే. అలాంటిది ఏకంగా డూప్లెక్స్ ఇంటినే నిర్మించారు. అందులో సగం ఖర్చు ఆ డిజైన్లకే అయ్యిండొచ్చు. చాలా ఆకర్షణీయంగా ఇంటిని నిర్మించారు. దీన్ని చూశాక ఇంటి నిర్మాణానికి ఎక్కువ స్థలం కావాలన్నా ఆలోచన తప్పకుండా మారుతుంది. అలాగే తక్కువ ఖర్చుతో ఇంటిని ఆకర్షణీయంగా కట్టుకోవాలన్నా ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి.. ఈ ఇంటి నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోను మీరూ తిలకించి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.