మీకు పాత రూ.5 నాణేలు కనిపించి నెలలు గడుస్తోందా! అయితే మీరు విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. కప్రో-నికెల్‌తో తయారయ్యే పాత రూ.5 నాణేలు విదేశాలకు తరలిపోతున్నాయట. వీటిని కరిగించి మరో రకంగా వీటిని వినియోగిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత వాటి ముద్రణ ఆపేసి.. కొత్త కాయిన్స్ ను అందుబాటులోకి తెచ్చిందట.
గత కొద్ది నెలలుగా పాత రూ.5 నాణేల చలామణి పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని మీరూ గమనించే ఉంటారు. 9 గ్రాముల బరువుతో కప్రో-నికెల్‌తో తయారయ్యే పాత నాణేల స్థానంలో, ఆర్‌బీఐ కొత్తగా అతి తేలికైన నాణేలను అందుబాటులోకి తెచ్చింది. ఇంత తక్కువ సమయంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం ఎందుకుందో తెలుసా..? స్మగ్లర్లు, పాత రూ.5 నాణేలను విదేశాలకు తరలించి కోట్లలో వెనకేసుకుంటున్నారట. వాటి కట్టడి కోసమే ఆర్‌బీఐ పాత నాణేల ముద్రణ ఆపి.. కొత్త వాటిని అందుబాటులోకి తెచ్చిందట. ఇంతకీ ఆ నాణేలను ఏ దేశానికి తరలిస్తున్నారు..? వాటిని వారు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
స్మగ్లర్లు పాత రూ.5 నాణేలను బంగ్లాదేశ్‌కి తరలిస్తున్నారట. ఈ విషయాన్ని పసిగట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వాటి ముద్రణను నిలిపివేసి. కొత్త వాటిని అందుబాటులోకి తెచ్చిందని సమాచారం. ఇంతకీ ఆ నాణేలను ఏం చేస్తున్నారంటే.. కప్రో-నికెల్‌తో తయారయ్యే వీటిని కరిగించి రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రూ.5 నాణెంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిని ఒక్కొక్కటి రూ.2 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. రూ.5 కాయిన్‌తో రూ.12 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం రూ.కోట్లలో సాగుతోందని వినికిడి.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం దీని కట్టడికి చర్యలు చేపట్టింది. రూ.5 నాణేల తయారీకి వాడే మెటల్స్‌ని మార్చాలని ఆర్‌బీఐని ఆదేశించింది. దీంతో ఆర్‌బీఐ పాత కాయిన్స్‌తో పోలిస్తే సన్నగా ఉండేలా కొత్త రకం నాణేలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిని మార్కెట్లో తక్కువ ధరకే లభించే మెటల్స్‌తో తయారు చేస్తోంది. కొత్త వాటిని స్మగ్లింగ్ చేసినా వాటితో ఎలాంటి లాభం ఉండదని సమాచారం. ఒక కాయిన్ సర్ఫేస్ విలువ, మెటల్ విలువ వేరు వేరుగా ఉంటుంది. సర్ఫేస్ వాల్యూ అనేది కాయిన్ విలువను నిర్ణయిస్తుంది. ఒక్కోసారి మెటల్ విలువ అనేది.. కాయిన్ విలువకంటే అధికంగా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకునే స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.