బంగారం ధర ఒక్కసారిగా తగ్గిపోతుంది. బంగారం డిమాండ్ పడిపోవడంతో ధరల రెక్కలు విరిగాయి. దీంతో పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదేనా? కాదా?
ప్రస్తుతం బంగారం డిమాండ్ అనేది ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరిగిపోవడంతో డిమాండ్ తగ్గింది. తగ్గినప్పుడు కొందాములే అన్న ఉద్దేశంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కొనుగోలు విలువ అనేది తగ్గింది. గత ఏడాది మొదటి త్రైమాసికానికి డిమాండ్ విలువ అనేది 135.5 టన్నులు ఉంటే.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 112.5 టన్నులతో సరిపెట్టుకుంది. విలువ పరంగా కూడా.. గత ఏడాది మొదటి త్రైమాసికంలో రూ. 61,540 కోట్లు ఉంటే ప్రస్తుత త్రైమాసికంలో రూ. 56,540 కోట్లకు పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం ధర తగ్గింది.
మొన్నటి వరకూ హెచ్చుతగ్గులతో ఊగిసలాడిన బంగారం ధరలు.. నాలుగు రోజుల క్రితం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ధరలు పెరుగుదల కారణంగా బంగారం కొనేవారి సంఖ్య తగ్గింది. దీంతో బంగారం ధర దిగొచ్చింది. గత రెండు రోజులుగా బంగారం ఐతే పడిపోతూ వస్తుంది. ఐతే ఇటువంటి పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదేనా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలు దిగొస్తున్నాయి. ధరలు తగ్గాయి కాబట్టి కొనేందుకు జనం ముందుకొస్తారు. ఈ క్రమంలో మళ్ళీ ధరలు పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ధరలు తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం డిమాండ్ పెరగడం అనేది కొనాలన్నా ఆసక్తి చూపే వారి మీద ఆధారపడి ఉంటుంది. ధర తగ్గింది కాబట్టి అందరూ ఒక్కసారిగా కొనుగోలు చేయడం మొదలుపెడితే మళ్ళీ ధర పెరుగుతుంది. ఇది రేపు జరగొచ్చు, ఎల్లుండి జరగొచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఈ మార్పు అనేది చోటు చేసుకుంటుంది. బంగారం డిమాండ్ తగ్గడం అనేది తాత్కాలికం మాత్రమే. ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనుకోవడానికి లేదు. ఏ సమయంలో అయినా సరాసరి పెరిగిపోతుంది. కాబట్టి తక్కువగా ఉన్నప్పుడు కొనేసి పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు. మళ్ళీ పండుగలు, వేడుకలు వస్తే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఎంత పెరుగుతుందో అనేది ఖచ్చితంగా చెప్పలేము గానీ పడిపోయిన బంగారం లేస్తే మాత్రం రికార్డు స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎంత హై లెవల్ కి వెళ్ళింది? ఎంత లో లెవల్ కి వెళ్ళింది? అనే లెక్కలు వేసుకుని కరెక్ట్ గా ఎప్పుడు కొనాలో అంచనా వేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇంతకు మించి తగ్గదు అని మీకు తెలిస్తే ఆరోజే మీరు బంగారం కొనుగోలు చేయండి. ఒకవేళ కొన్న తర్వాత బంగారం పడిపోయినా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయి, పెరగాల్సిందే. ఎందుకంటే దాని డిమాండ్ అటువంటిది.