gold: ఈ ప్రపంచంలో బంగారానికి, దాంతో తయారైన వస్తువులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శుభకార్యాలు జరుగుతున్నపుడు బంగారు వస్తువులు కొనుక్కోవటం ఆనవాయితీ. కొన్నికొన్ని ప్రత్యేక రోజుల్లో బంగారు నగల షాపుల వాళ్లు అఫర్లు, డిస్కౌంట్ల పేరుతో ప్రజల్ని ఆకర్షిస్తుంటారు. మరికొంతమంది.. తక్కువ ధరలతో పాటు నమ్మకం కూడా మా సొంతం అంటూ ప్రచారం చేసుకుంటుంటారు. తాము 24 క్యారట్ల ప్యూర్ బంగారు నగల్ని విక్రయిస్తామంటూ ఉంటారు. అయితే, 100 ప్యూర్ బంగారంతో వస్తువులు దొరకటం అనేది అసాధ్యం. బంగారు గనులనుంచి బంగారం వెలికి తీసిన తర్వాత బార్‌ల రూపంలో భద్రపరిస్తే అది 99.99 శాతం మాత్రమే స్వచ్ఛతను కలిగి ఉంటుంది.
దీనితో బంగారు నగల్ని తయారు చేస్తే గట్టిదనం ఉండదు. బలహీనంగా ఉండి విరిగిపోయే అవకాశం ఎక్కువ. అందుకనే ఆ బంగారంలో కల్తీ కలుపుతారు. రాగి, వెండి వంటి వాటిని బంగారంలో కలుపుతారు. దీంతో స్వచ్ఛత 91.6 శాతానికి తగ్గిపోతుంది. దాదాపు 8 శాతం బంగారం వినియోగదారులు నష్టపోతారు. అయినప్పటికి వ్యాపారులు నష్టపోయిన దానికి కూడా కలిపి డబ్బు కట్టించుకుంటారు. చాలా మంది వినియోగదారులకు ఈ విషయం తెలిసినా ఏం చేయలేని స్థితి. దీన్నే వ్యాపారులు బిజినెస్ అంటారు.. వినియోగదారులు మోసం అంటారు. బంగారంలో కల్తీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jio, Airtel పోటాపోటీ.. 30 రోజుల వ్యాలిడిటీ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.