ట్విట్టర్ బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్ర స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పడిపోవడంతో, ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తుల విలువ 171 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 164 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరా? అని నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.
ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ వస్తువుల కంపెనీ అయిన LVMH(Louis Vuitton Moët Hennessy)కి CEO. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్యాషన్ వస్తువుల బ్రాండ్లు ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. 1949లో ఉత్తర ఫ్రాన్స్‌లోని రౌబైక్స్ లో జన్మించిన ఆర్నాల్ట్.. ఇకోలే పాలిటెక్నిక్ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం వ్యాపారవేత్త ఫెరెట్-సావినెల్ కుటుంబ వ్యాపారంలో పనిచేశారు. ఆ తరువాత 1981లో అమెరికాకు మకాం మార్చారు. అనంతరం 984లో ఫ్రాన్స్ కు తిరిగొచ్చి దివాలా తీసిన వస్త్ర కంపెనీ బౌశాక్ సెయింట్-ఫ్రెరేస్ ను కొనుగోలు చేశారు. ఇది ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తుండేది.
Bernard Arnault likes to keep a low profile. But he was once described as “a wolf in cashmere.”
From Bulgari to Dom Perignon, here’s how the French billionaire built his luxury-goods empire — and the world’s biggest fortune https://t.co/rRjjkbFyN6 pic.twitter.com/tvraWZJg1M
— Bloomberg Pursuits (@luxury) December 14, 2022
అనంతరం ఇతర లాభాల ద్వారా LVMHలో వాటాలను కొనుగోలు చేశారు.. LVMH. రాను.. రాను.. LVMHను విలాసవంతమైన వస్తువలకు బ్రాండ్ గా మార్చారు. లూయిస్ విటన్, సెఫోరా సహా మొత్తం 70 ఇతర ఫ్యాషన్ బ్రాండ్లు ఎల్బీఎంహెచ్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. షాంపేన్, వైన్, స్పిరిట్, ఫ్యాషన్, లెదర్ వస్తువులు, చేతి గడియారాలు, ఆభరణాలు, హోటళ్లు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,500 స్టోర్లు ఉన్నాయి. ఆయనకు ఐదుగురు సంతానం కాగా, వీరిలో నలుగురు LVMHలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
మస్క్ అగ్ర స్థానాన్ని కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆయన వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ఈ డీలు పూర్తి చేసేందుకు మస్క్ 19 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించారు. దీంతో ఏ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా కంపెనీ షేరు విలువ దాదాపు 50 శాతానికిపైగా తగ్గిపోయింది. ఫలితంగా దాదాపు 168 బిలియన్ డాలర్ల మస్క్ సంపద ఆవిరైందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇక ఈ జాబితాలో ఇండియాకు చెందిన వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్ల సంపదతో మూడోస్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(116 బిలియన్ డాలర్లు) నాలుగు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్(116 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో ఉన్నారు.