ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ వాట్సాప్ ను వాడుతున్నారు. ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం వాట్సాప్. అంతలా ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారులను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది కూడా. ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందిస్తూ రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. తాజాగా యూజర్ల కోసం మరో సూపర్ ఫిచర్ అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం టెక్స్ట్ తో సెర్చ్ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్ సెర్చ్ ఫీచర్ తో మెసేజ్ సెర్చ్ చేయెచ్చు.
సాధారణంగా ఇప్పటి వరకు అందరూ చాట్ పేజీలో అవరసమైన మెసేజ్ ను టెక్స్ట్ తో సెర్చ్ చేసేవారు. అయితే తాజాగా వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్ తో డేట్ ఆధారంగా కూడా సెర్చ్ చేయవచ్చు. యూజర్లు సెర్చ్ బార్ పై క్లిక్ చేస్తే.. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు ఏరోజు మెసేజ్ కావాలో ఈజీగా సెర్చ్ చేయెుచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. కొన్ని పరీక్షల అనంతరం పూర్తి స్థాయిలో యూజర్లకు అందబాటులోకి రానుంది. డేట్ సెర్చ్ ఫీచర్ తో పాటు వాట్సాప్ సర్వే పేరుతో కూడా మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ ఫీచర్ల పనితీరు, సర్వీస్ గురించి యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు.
యాప్ వినియోగం గురించి తమ అభిప్రాయాలను తెలియజేయమని కోరుతూ వాట్సాప్ తన వెరిఫైడ్ ఖాతా నుంచి వినియోగదారులకు ఇన్విటేషన్ పంపుతుంది. దాన్ని ఓపెన్ చేసి యూజర్లు.. తమ అభిప్రాయాలను, సూచలను తెలియజేయవచ్చు. సర్వేలో పాల్గొనటం ఇష్టం లేకుంటే వాట్సాప్ పంపిన ఇన్విటేషన్ ను తిరష్కరిస్తే సరిపోతుంది. మరి.. మెసేజ్ యాప్ వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.