ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎదుటివారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా.. దూరంగా ఉన్నవారిని చూడాలన్నా అందరి చూపు వాట్సాప్ వైపే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సాప్.. మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకురానుంది.ఈ ఫీచర్‌తో ఫార్వర్డ్ మెసేజ్‌లకు కళ్లెం వేయనుంది.
వాట్సాప్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో ఆయా వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఫార్వర్డ్ చేయకుండా పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్‌ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. ఒక వేళ సదరు సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్‌లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్ వాట్సాప్‌బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో.. ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునే వాట్సాప్ అభిప్రాయపడుతోంది.
As a reminder, we have limits on message forwarding and we label messages that haven’t originated with the sender so people are aware that something is information from a third party: https://t.co/SrOdYUOZIJ
— WhatsApp (@WhatsApp) February 27, 2022
మెసేజ్ ఫార్వార్డింగ్ విషయంలో వాట్సాప్ గతంలో ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్‌కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్ సదరు మెసేజ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ‘ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అంటూ ఆయా మెసేజ్‌కు లేబిలింగ్‌ను వాట్సాప్ ఇస్తోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ఫేక్ న్యూస్ ని ఎంతమేర అరికడుతుందో చూడాలి మరీ.