వాట్సాప్.. ఇప్పుడు ఎవరి స్మార్ట్ ఫోన్‌లో చూసినా ఈ యాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే.. ఉంటుంది కూడా. కేవలం చిట్ చాట్ చేయడానికే కూండా.. బిజినెస్ కార్యకలాపాలకు కూడా ఈ యాప్ తప్పనిసరి అయ్యింది. వాట్సాప్.. వినియోగంలోకి రాకముందు మెసేజ్ చేయాలంటే చార్జీలు ఉండేవి. మెసేజ్ చేస్తే చాలు.. రూపాయో, రూపాయన్నారో కట్ అయ్యేవి. లేదంటే మెసేజ్ లకు సంబంధించి స్పెషల్ రీచర్జ్ లు చేపించాల్సి వచ్చేది. వీటన్నిటికీ చెక్ పెడుతూ.. 2009లో బ్రెయిన్ ఆక్టాన్, జాన్ కౌమ్ దీన్ని డెవలప్ చేశారు. ఇంటర్‌నెట్ ఆధారంగా మెసేజ్‌లు పంపేలా దీన్ని డెవలప్ చేశారు. అయితే మొదటి ఏడాది దీన్ని ఫ్రీగా వాడేలా రూపొందించినా.. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒక డాలర్‌ను చార్జ్ చేసేవారు.
అప్పటివరకు ఫేస్‌బుక్ అంటే ఇంట్రెస్ట్ చూపించిన యూజర్లు.. క్రమంగా వాట్సాప్ మెసేంజర్ యాప్ వైపు పరుగులు తీశారు. చివరకు ఫేస్‌బుక్.. 2014లో $19 బిలియన్లకు వాట్సాప్ ని కొనుగోలు చేసింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు 450 మిలియన్లు.. ప్రస్తుతానికి ఈ సంఖ్య 2 బిలియన్లు. అయితే ఫేస్ బుక్ కొన్న తర్వాత ఆ డాలర్ చార్జ్‌ను కూడా ఎత్తేసింది. దాంతో ఇది ఫ్రీ యాప్ అయిపోయింది. అయితే.. ఇక్కడే అందరి ఆలోచన. వాట్సాప్ ఫ్రీ యాప్ కదా? మన దగ్గర నుంచి ఎలా ఛార్జ్ చేయట్లేరు? మరి ఆదాయం ఎలా వస్తుంది అన్నదే ప్రశ్న.
ఇది కూడా చదవండి: యువరాజ్ సింగ్ కంపెనీ వినూత్న ఆలోచన.. రూ.12కే విమాన ప్రయాణం..!
వాట్సాప్‌ను యూజర్.. ఇన్ స్టాల్ చేసుకునే క్రమంలో.. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు ఒక పాయింట్‌ను ఆడ్ చేసింది. అందుకే మన వాట్సాప్ లో ఉండే లొకేషన్, ఫోన్ నెంబర్, ఇతర అడ్రస్ లాంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తోంది. ఫేస్ బుక్ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఉపయోగించుకొని బిజినెస్ చేస్తోంది. యూజర్లు వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారో ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రహించి.. కంపెనీలకు చేరవేస్తూ.. యాడ్స్ రూపంలో కంపెనీల నుంచి ఆదాయాన్ని సంపాదిస్తోంది ఫేస్‌బుక్.
India houses 20% of WhatsApp’s & 15% of @Facebook‘s total users#Facebook #Reliance pic.twitter.com/DuJsg5MW7L
— CNBC-TV18 (@CNBCTV18Live) April 22, 2020
ఇది కూడా చదవండి: నెలకు రూ.210 కడితే రూ.5,000 పెన్షన్.. భారీగా చేరుతున్న జనం!
ఇప్పటికే ఫేస్ బుక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను అమ్ముకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాట్సాప్‌కు మరో ముఖ్యమైన ఆదాయ మార్గం ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్). ఇది వాట్సాప్ ద్వారా కంపెనీలు యూజర్లకు దగ్గరగా ఉండేందుకు మీడియేటర్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా కస్టమర్లు మెసేజ్ చేసిన 24 గంటలలోపు కంపెనీలు రిప్లై ఇస్తే ఎలాంటి ఫీజు ఉండదు. కానీ ఆ తర్వాత మెసేజ్ చేస్తే మాత్రం ప్రతి మెసేజ్‌కు రూ.30 పైసల దాకా చార్జ్ చేస్తున్నారు. ఇక త్వరలోనే వాట్సాప్ స్టేటస్ మధ్యలో యాడ్స్‌ను ప్లే చేసేందుకు కూడా ప్లాన్ చేస్తోందంట వాట్సాప్.
If whatsapp has ~460m MAUs, and assume
5% (x) of internet users dont have whatsapp (add 24m)
10% (y) of these hv whatsapp on dual sim (less 46m)
then total unique internet users in India are 460+24-46=438m.What am I missing? Happy to revise x and y. https://t.co/dP0VUji6Aj
— Sajith Pai (@sajithpai) January 17, 2021