ఇండియాలో 3వ అతిపెద్ద ఫోన్ ఆపరేటర్ అయినటువంటి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని ఎక్కువశాతం వాటాను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బకాయిలను ఈక్విటీగా మార్చాక వొడాఫోన్ ఐడియా కంపెనీలో 35.8 శాతం వాటా గవర్నమెంట్ చేతికెళ్లింది. ఈ విషయం అటు కంపెనీకి, ఇటు షేర్ హోల్డర్లకి బాధాకరమే.
వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోవడం, కంపెనీకి లాభాలు లేని పరిస్థితులు కారణంగానే ఇలా చేయక తప్పట్లేదని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు జనవరి 10న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వానికి వాటా కేటాయించేందుకు అంగీకరించింది. ఇక కంపెనీ వాటాలలో.. యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థకి 17.8 శాతం ఉండగా.. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం వరకు వాటా కలిగి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పూర్తి వివరాలను తెలిపింది వొడాఫోన్ ఐడియా కంపెనీ. మరి వొడాఫోన్ ఐడియా తమ 36% వాటా ప్రభుత్వానికి అప్పగించడం పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.