ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అత్యంత ప్రతికూలంగా మారింది. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ అతలాకుతలమవుతోంది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ సంస్థలకు స్టాక్ మార్కెట్లలో చుక్కెదురైంది. ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో ఆ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇన్వెస్టర్లలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్ అదానీ పలు చర్యలకు ఉపక్రమించారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అందుకు తగ్గట్లే తనఖా పెట్టిన షేర్లను విడిపించడానికి ఆయన రెడీ అవుతున్నారని నిపుణులు అంటున్నారు. ఇదిలాఉండగా.. అదానీ గ్రూప్ వ్యవహారంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
అదానీ వ్యాపార లావాదేవీలన్నీ గాలిబుడగ తీరును తలపిస్తున్నాయంటూ హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొనడంతో.. పది రోజుల వ్యవధిలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో దీనిపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ఇందులో విదేశీ కుట్ర ఉందని ఆయన అన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. భారత పురోగతిని విదేశీయులు సహించలేకపోతున్నారని సెహ్వాగ్ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇండియన్ మార్కెట్ మీద జరిగిన ఈ దాడి.. పక్కా ప్లాన్ చేసిన కుట్రలాగే కనిపిస్తోందన్నాడు. వాళ్లు (విదేశీయులు) ఎంత ప్రయత్నించినా భారత్ మరింత దృఢంగా తయారవుతుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదానీకి మద్దతుగా సెహ్వాగ్ ట్వీట్ చేయడంపై కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, అదానీకి సపోర్ట్‌గా సెహ్వాగ్ చేసిన ట్వీట్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Goron se India ki tarakki bardaasht nahi hoti. The hitjob on India’s market looks like a well planned conspiracy. Koshish kitni bhi kar lein but as always, Bharat aur majboot hi nikalkar ubhrega.
— Virender Sehwag (@virendersehwag) February 6, 2023