నష్టాల్లో ఉన్నామంటూ టెలికాం కంపెనీలు రోజుకొకటి చొప్పున ధరలను పెంచేస్తున్నాయి. మునుపటి ప్లాన్ల ధరలలో కొన్ని మార్పులు చేసి.. వాటికి మరికొన్ని కొత్త ప్రయోజనాలు జోడించి కొత్తవాటిగా ప్రవేశపెడుతున్నాయి. వీటి వల్ల యూజర్లకు పెద్దగా ప్రయోజనాలు ఉండటం లేదు కదా ధరల పెరుగుదలతో మరింత భారాన్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితులలో అగ్రశ్రేణి టెలికాం కంపెనీల కన్నా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్ ఐడియా(వీఐ) కొంచెం బెటర్. ‘వీఐ’లో అతి తక్కువ ధరకే డేటా, డిస్ని+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించే ప్లాన్ ఒకటుంది. దాని ప్రయోజనాలేంటో మీరే తెలుసుకోండి..
వీఐ యొక్క లేటెస్ట్ రూ.151 ప్లాన్, యూజర్లకు తక్కువ ధరలో OTT ప్రయిజాలను అందించే బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు 3 నెలల పాటు Disney+ Hot Star సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో 8GB హై స్పీడ్ డేటా కూడా అందిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ తో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు మీకు లభించవు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
క్రికెట్ ప్రేమికులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పాలి. సాధారణంగా డిస్ని+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే.. నెలకు రూ.299 లేదా ఏడాదికి రూ. 899 చెల్లించాలి. అదే ఇంకొంచెం హెచ్డీ క్లారిటీలో చూడాలనుకుంటే ఏడాదికి రూ. 1,499 చెల్లించాలి. ఈ ధరలతో పోల్చి చూస్తే.. వీఐ అందించే రూ.151 ప్లాన్ ప్రయోజనాలు ఉపయోగకారమే. పైగా 8GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. రూ.151 ప్లాన్ ప్రయోజనాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.