యాపిల్ ఐఫోన్.. మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్. ప్రతి ఒక్కరూ కొనాలనే భావిస్తారు. ఎందుకంటే దీని ప్రత్యేకత అలాంటింది. కానీ ఫోన్ ధర అధికంగా ఉండడం చేత సామాన్యులు దీనికి దూరంగా ఉంటున్నారు. డిమాండ్ ఎక్కువుగా ఉండడం కారణంగా దీని ధర తగ్గదు. అలాంటి వారందరికి ఫ్లిప్ కార్ట్ శుభవార్త చెప్పింది. రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14 వేలకే అందిస్తున్నట్లు వెల్లడించింది.
వాలెంటైన్స్ డే సంధర్బంగా ఐఫోన్ ప్రియుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. 26శాతం డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్ల కింద రూ.14వేలకే ఐఫోన్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14 వేలకే అందిస్తున్నట్లు వెల్లడించింది. బ్లాక్ కలర్ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్ 26శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,990కి తగ్గుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ ఎస్ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ను రూ.15,500 ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.13,799కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీకు ఎక్ఛేంజ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చా లేదా తెలుసుకోవాలంటే మీ ప్రాంతానికి చెందిన పిన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.