దేశంలో 5జీ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడేండ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రాగలవన్న మంత్రి.. తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆ జాబితాలో.. ఢిల్లీ, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె, చండీఘర్, గాంధీనగర్, అహ్మాదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు కూడా ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను విస్తరించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5జీ స్ప్రెక్టం వేలాన్ని పూర్తి చేసి స్పెక్ట్రం కేటాయింపులను చేపడుతోంది. జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకూ కొనసాగిన స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 10 బ్యాండ్స్‌లో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా 51,236 మెగాహెట్జ్ స్పెక్ట్రం (సుమారు 71 శాతం) అమ్ముడైంది. విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్ జియోనే(రూ. 88,078 కోట్లు) బిడ్లతో దక్కించుకుంది.
ఇక, భారతీ ఎయిర్‌టెల్, 700 మెగాహెర్జ్ మినహా, వివిధ బ్యాండ్ లో 19,867 మెగాహెర్జ్ స్పెక్ట్రంను రూ.43,084 కోట్లతో కొనుగోలు చేయగా, వొడాఫోన్ ఐడియా రూ.18.799 కోట్ల విలువైన 6228 మెగాహెర్జ్ స్పెక్ట్రంను, ఆదానీ గ్రూప్, 238 గిగాహెర్జ్ బ్యాండ్లలో 400 మెగాహెర్జ్ స్పెక్ట్రంను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఏ టెలికాం ఆపరేటర్ ముందుగా 5జీ సేవలను ప్రారంభిస్తుందో అన్న విషయంపై సమాచారం లేదు. కాకపోతే, జియో, ఎయిర్‌టెల్, వీఐ(వొడాఫోన్ ఇండియా) లాంటి నెట్‌వర్క్స్ ఇప్పటికే కొన్ని నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ సైట్స్‌ను సెటప్ చేశాయి. రాబోవు రెండు నెలల్లో 5జీ పెట్టడం ఖాయం. 5జీ టెక్నాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్లు అరూపంలో తెలియజేయండి.
On Thursday, Union Minister Ashwini Vaishnaw announced that affordable 5G telecom services will be launched in India starting from October 12.#ashwinivaishnaw #unionminister #5G #news pic.twitter.com/H9stMqQ5bp
— Ennoble IP (@EnnobleIP) August 26, 2022