బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ కేంద్రం సామాన్యులకు తీపి కబురు చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకునేందకు వీలుగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి, కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో భాగంగా.. ఈ సారి పీఎం ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. క్రితం సారి బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజన కోసం కేవలం రూ.48 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించగా.. ఈ సారి మాత్రం ఆ మొత్తాన్ని ఏకంగా 66 శాతం పెంచి.. రూ.79 వేల కోట్లు కేటాయించడం విశేషం. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతున్న వేళ .. ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కల్పించనుంది.
ఈసారి బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజన పథకానికి నిధులు పెంచి.. సామాన్యులకు శుభవార్త చెప్పింది కేంద్రం. పీఎం ఆవాస్ యోజన కోసం ఈ సారి 66 శాతం పెంచి.. ఏకంగా 79 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దాంతో గృహ కొనుగోళ్లు పెరుగుతాయని మార్కెట నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఇలా సామాన్యులకు ఊరట కల్పించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం సానుకూల ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు.