2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తూ.. వేతన జీవులకు తీపి కబురు చెప్పారు. ఆదాయ పన్ను మినహాయింపును రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో రూ. 7 లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే, రూ. 7 లక్షలు దాటాక ఐదు స్లాబుల్లో పన్ను విధించనున్నారు.
#UnionBudget2023 | Personal Income Tax: “The new tax rates are 0 to Rs 3 lakhs – nil, Rs 3 to 6 lakhs – 5%, Rs 6 to 9 Lakhs – 10%, Rs 9 to 12 Lakhs – 15%, Rs 12 to 15 Lakhs – 20% and above 15 Lakhs – 30%, ” says Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/li3dXsHGfA
— ANI (@ANI) February 1, 2023