డబ్బు సంపాదన కోసం చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ఉద్యోగం కంటే ఎక్కువగా వ్యాపారం చేయడానికే మొగ్గు చూపుతుంటారు. టిఫిన్ సెటర్, ఫ్రూట్స్, వస్త్ర దుఖానాలు ఎవరికి తోసింది వారు వ్యాపారం చేస్తుంటారు. నిరుద్యోగుల నుంచి మొదలుకుని గ్రాడ్యేయేట్స్ వరకు ఈ వ్యాపారాల్లో రాణిస్తుంటారు. ఉన్నత విద్యనభ్యసించి టీ స్టాల్లు, బజ్జీ కొట్టు పెట్టుకొని సంపాదించేవారు కూడా ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఇద్దరు యువకులు ఖరీదైన ఆడి కార్ లో వచ్చి వ్యాపారం చేస్తున్నారు.

వారు ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారు. విలాసవంతమైన జీవితం అనుభవించడానికి కావాల్సినంత ధనం ఉంది. అయినా వారు ఆడి కార్ లో వ్యాపారం చేయడానికి నిర్ణయించుకున్నారు. అంత ఖరీదైన కారులో వారు ఇలా చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అమిత్ కశ్యప్, మనుశర్మ ముంబైలోని లోఖండ్ వాలా బ్యాక్ రోడ్డులో ఆడి కార్ లో వచ్చి, డిక్కీలోని టీ సామాగ్రిని తీసుకుని వేడి వేడి గా చాయ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ అమ్మడం అయిపోయిన తరువాత ఆడి కార్ లో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు.
వారి అంతిమ లక్ష్యం ఏంటంటే వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. బిసినెస్ లో ఎలా రాణించాలి అనే వినూత్నమైన ఆలోచనతో ఈ విధానానికి తెరలేపారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖరీదైన ఆడి కారులో ఆన్ డ్రైవ్ టీ అనే పేరుతో థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ అంటూ టీ అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ముంబైలోని లోఖండ్ వాలా ఏరియాలో టీ స్టాల్ ప్రారంభించారు. స్వయంగా టీ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. అదనపు ఆదాయం కోసమే వీరు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కొంతమంది స్పందిస్తూ విలాసవంతమైన జీవితం ఉండి, ఖరీదైన కారులో ఇలా టీ వ్యాపారం చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.