కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. కొందరు ఆ కలను నెరవేర్చుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే సొంత కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే కొత్త కారు అంటే లక్షల్లో ఉంటుంది. అలాంటి వారికోసం ఇప్పుడు ఒక మంచి ఉపాయాన్ని తీసుకొచ్చాం.
కారు కొనడం అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తికి కలగా ఉంటుంది. ఎప్పటికైనా ఒక సొంత కారు కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సిటీల్లో అయితే నలుగురు వ్యక్తులున్న కుటుంబానికి కారు అనేది అవసరం కూడా. కానీ, కారు కొనడం అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకు చాలా డబ్బు కావాలి, కారు కోసం ఫైనాన్స్ కావాలి, నెలవారీ ఈఎంఐలు మీ బడ్జెట్ కి తగినట్లు ఉండాలి. ఇన్ని సవాళ్ల మధ్య కారు కొనడం ఒక పెద్ద సమస్య అవుతుంది. కానీ, కొనడం అసాధ్యం అని మాత్రం అనుకోకండి. టయోటా కంపెనీకి చెందిన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు గ్లాంజాని కొనుగోలు చేసేందుకు ఒక ప్లాన్ ఉంది.
టయోటా కంపెనీ కార్లు అంటే కాస్త ఖరీదుగానే ఉంటాయి. సాధారణంగా టయోటా నుంచి ప్రీమియం కార్లే విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ గ్లాంజా కూడా. ఈ ప్లాన్ ప్రకారం మీరు బేస్ మోడల్ ని మాత్రమే కొనుగోలు చేయగలరు. మిడ్ రేంజ్, హై ఎండ్ కారుని కొనాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. గ్లాంజా మోడల్ బేస్ వేరియంట్ ధర రూ.6.66 లక్షలుగా ఉంది. దీని ఆన్ రోడ్ ప్రేస్ చూస్తే రూ.7.53 లక్షలు అవుతుంది. ఇంతపెట్టి మేము కారు కొనలేం అని కంగారు పడకండి. ఇక్కడి నుంచే మీరు తెలివిగా నడుచుకోవాలి. అప్పుడు కేవలం రూ.60 వేలు కట్టి మీరు కొత్త కారుని ఇంటికి తీసుకెళ్లచ్చు.
గ్లాంజా కారుకి ఫైనాన్స్ ఎక్కువగా లభిస్తుంది. మీరు ఈ కారుపై దాదాపు 90 శాతం వరకు లోన్ పొందవచ్చు. ఈఎంఐ కాలుక్యులేటర్ లెక్కల ప్రకారం మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో గ్లాంజా కారుపై రూ.6.93 లక్షల వరకు పైనాన్స్ పొందవచ్చు. అంటే మీరు ఇంక మిగిలిన రూ.60 వేలను డౌన్ పేమెంట్ గా కడితే సరిపోతుంది. అప్పుడు మీరు గ్లాంజా కారుని ఎంచక్కా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత ఐదేళ్ల వరకు మీరు ఈ ఫైనాన్స్ ని చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మీరు రూ.14,675 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్రోల్ లో గ్లాంజా ఈ, గ్లాంజా ఎస్, గ్లాంజా జీ, గ్లాంజా వీ అనే వేరియంట్లలో వస్తోంది. ఇందులో సీఎన్జీ వర్షన్ కూడా ఉంది.
ఇంక ఈ కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 4+1 సీటింగ్ కెపాసిటీ కలిగిన కారు. ఈ గ్లాంజా 1197 సీసీ కలిగిన 4 సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. 2520 వీల్ బేస్, 66 కిలోవాట్ మ్యాక్సిమమ్ పవర్, 113ఎన్ఎం టార్క్, 22.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంక ఇంటీరియర్ చూస్తే.. ఇందులో హెడప్ డిస్ ప్లే ఉంది. 22.86 సెంటీమీటర్ల ఫ్లోటింగ్ స్మార్ట్ ప్లే కాస్ట్ ఉంది. ఇందులో వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. హేయ్ టయోటా అని మీకు కావాల్సింది అడగచ్చు. ఇందులో ఇంటిలిజెంట్ గేర్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంది. మీరు 360 డిగ్రీల వ్యూయింగ్ పొందవచ్చు. ఇందులో ఆటో ఏసీ టెక్నాలజీ ఉంది. కారు టెంపరేచర్ ని బట్టి ఏసీ అడ్జస్ట్ అవుతుంది. ఈ టయోటా గ్లాంజా మోడల్ మొత్తం 5 కలర్ వేరియంట్స్ లో వస్తోంది.
It’s time you experienced #awesome drives! Trade in your used car for the Toyota Glanza today and get hatchin’.
To know more, visit https://t.co/cv2eiyqFOL.#ToyotaIndia #UTrust pic.twitter.com/lmjJMi2NSl
— Toyota India (@Toyota_India) April 24, 2023