భారీగా తగ్గిన బంగారం ధర.. ఇక ఎందుకు ఆలస్యం..?

ఈ రోజుల్లో భూమి తర్వాత అంత డిమాండ్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది బంగారమే. బంగారం, వెండి, వజ్రాల వండి వాటిని ఇష్టపడని మహిళలు ఉండరు. ఇప్పుడు పురుషులు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఆపదలోను, అవసరానికి వస్తున్న బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో అట్టిపెట్టుకుంటున్నారు. అందుకే ఏ రోజు ఎంత ధర ఉందో చూస్తూ ఉంటారు.

‘నీ ఇల్లు బంగారం గానూ, నా ఒళ్లు సింగారం గానూ’ అంటూ ఓ సినిమాలో నటీమణి పసిడికి ఉన్న విలువను చెప్పకనే చెప్పింది. అవును మరీ ఈ రోజుల్లో భూమి తర్వాత అంత డిమాండ్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది బంగారమే. బంగారం, వెండి, వజ్రాల వండి వాటిని ఇష్టపడని మహిళలు ఉండరు. ఇప్పుడు పురుషులు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఆపదలోను, అవసరానికి వస్తున్న బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో అట్టిపెట్టుకుంటున్నారు. అందుకే ఏ రోజు ఎంత ధర ఉందో చూస్తూ ఉంటారు. ఇప్పొడక స్టేటస్ సింబల్‌గా మారిన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు కొంత మంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల సీజన్ కారణంగా పెరుగుతూ వస్తున్న బంగారం.. ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం కూడా ఇందుకు కారణం కావచ్చు.

బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకొక అద్బుత అవకాశం వచ్చిందని చెప్పాలి. కొన్ని రోజులుగా మేలిమి బంగారం ధర గ్రాము సుమారు ఏడు వేలకు దగ్గరగా పలుకుతూ.. గరిష్ట స్థాయి రేటుకు చేరుకుంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, యూఎస్ జీడీపీ గణాకాలు వంటివి ప్రభావం చూపుతున్నాయి. ఆదివారం కూడా బంగారం ధర తగ్గగా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. మరీ ఢిల్లీ,హైదరాబాద్ వంటి నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఆదివారం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గు ముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1946.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్ల అమెరికా డాలర్‌తో పోల్చితే రూ.82.623 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలు ఎలా ఉన్నాయంటే..? 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 110 తగ్గి రూ. 60, 750గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,650 పలుకుతోంది. ఇవాళ వెండి ధర మాత్రం పెరిగింది.ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.73 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో ధరలను పరిశీలిస్తే.. గత మూడు రోజులుగా భారీగా దిగి వచ్చిన ధర.. ఈ రోజు కూడా మార్పు చెందింది. ఈ మూడు రోజుల్లో తులంపై రూ.760 వరకు పతనమైంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 11 తగ్గి.. 60,600గా చూపిస్తుంది. 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.100 తగ్గి రూ.55, 550గా ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.77 వేలు పలుకుతోంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి ధరలు ఉంటాయి. అయితే ఈ సమయంలో బంగారం కొనుగోలు మంచిదని, మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed