రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా వారిపై పడకపోయినా పరోక్షంగా పడనుంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి చమురు, బంగారం, దిగుమతుల, ఎగుమతులు, స్టాక్ మార్కెట్ లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రత్యేకంగా వంటనూనెలు, బంగారం రేట్లు ఆకాశాన్నంటేలా కన్పిస్తున్నాయి. బంగారం ధర రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.
సాధారణంగా పసిడి ధరలు, వెండి ధరలు రోజూ మారుతుంటాయి. బంగారం ధరలపై దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం ఉంటుంది. అలానే తాజాగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో బంగారం ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. మనదేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర రూ.52 వేలు దాటేసింది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 ఉంది. ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,800, అదే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48,400 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.49,700. అదే 24 క్యారెట్ల ధర రూ.54,220. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.48,400 కాగా 24 క్యారెట్ల ధర రూ.52,800. తెలుగు రాష్ట్రాలో బంగారం ధరలు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇలానే మరికొద్ది రోజులు కొనసాగితే బంగారం ధర 60 వేలకు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. మరి..దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.