బంగార కొనాలనుకునేవారికి.. పసిడి ధర కాస్త ఊరట కలిగిస్తోంది. నేడు బంగారం ధర ఎలా ఉంది.. పెరిగిందా, తగ్గిందా అంటే..
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాక సెంటిమెంట్, ఇష్టం, ఆర్థిక భద్రత కూడా. అందుకే చేతిలో కాస్త డబ్బుంటే చాలు బంగారం కొనడానికే ఆసక్తి చూపుతారు. ఇక వివాహాది శుభకార్యాల వేళ బంగారానికి ఎంత భారీ డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బంగారానికి డిమాండ్ ఎక్కువ. దాంతో పసిడి ధర కూడా భారీగా పెరుగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలకు అనుకూలంగా బంగారం ధర పెరగడం, తరగడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర.. తాజాగా దిగి వచ్చింది. మరి నేడు దేశీయంగా బంగారం ధర ఎలా ఉంది.. తగ్గిందా, పెరిగిందా అంటే..
నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో ఎంత ధర ఉందో నేడు కూడా అదే కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 61,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోకూడా బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800 ఉండగా.. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 61,950 ఉంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర క్రితం సెషన్‌లో ఉన్నట్లే ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర 77,600 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండిధర 78,500గా ఉండి. వెండి, బంగారం ధరల్లో వ్యత్యాలు.. ఆయా ప్రాంతాల్లో విధించే ట్యాక్స్‌లను బట్టి మారుతూ ఉంటాయి.