మీ దగ్గర కొంత డబ్బు ఉంది పసిడి కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది కలిసొచ్చే కాలమని చెప్పొచ్చు. కొన్నినెలలుగా గరిష్ట కాలానికి చేరిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. పసడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ పరిమాణాల దృష్ట్యా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు 3 నెలల కనిష్ఠానికి దిగివచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పుత్తడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1947.90 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ఇవాళ రూ. 82.428 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో నిన్నటి ధరలే వర్తిస్తాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర తులానికి రూ. 60, 480లుగా పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.55, 450 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర 73 వేల రూపాయల వద్ద కొనసాగుతుంది.
హైదరాబాద్ నగరంలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం లేదు. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 60, 300గా నమోదైంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55, 300 వద్ద పలుకుతోంది. ఇక వెండి ధర కూడా స్థిరత్వంగానే ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.77,800 మార్క్ వద్ద కొనసాగుతుంది. అయితే హైదరాబాద్‌లో బంగారం ధర ఢిల్లీతో పోలిస్తే తక్కువగా ఉంటే.. వెండి ధర మాత్రం దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఇక ఆయా నగరాలను బట్టి కూడా ధరలు నిర్ణయించబడి ఉంటాయి.