మరోసారి ఢమాల్ అన్న బంగారం ధర.. మంచి తరుణం మించిన దొరకదు

భారత్‌లో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. మేలిమి బంగారాన్ని వివిధ రూపాల్లో పొందు పరుచుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిందా లేదా అనే సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. మహిళలతో పాటు మగవాళ్లు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఎంత బంగారం ఉంటే అంత హోదా అన్న లోకం తీరును ఫాలో అవుతున్నారు.

బంగారం అంటే ఇష్టపడని వారెవ్వరు ఉంటారో చెప్పండి. తులానికి వంద రూపాయలు తగ్గినా గోల్డ్ దుకాణాలకు వెళుతుంటారు. పెరిగినా బెంబేలు ఎత్తిపోతారు. ముఖ్యంగా భారత్‌లో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. మేలిమి బంగారాన్ని వివిధ రూపాల్లో పొందు పరుచుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిందా లేదా అనే సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. మహిళలతో పాటు మగవాళ్లు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఎంత బంగారం ఉంటే అంత హోదా అన్న లోకం తీరును ఫాలో అవుతున్నారు. అందుకే బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయా అని పరిశీలిస్తుంటారు. గోల్డ్, సిల్వర్ వస్తువులు కొనాలనుకుంటే.. నెల రోజుల నుండి ధరలు చెక్ చేస్తూ ఉంటారు. తగ్గగానే బంగారం దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అటువంటి వారికే ఓ గుడ్ న్యూస్

ఇటీవల కొండెనెక్కి కూర్కొన్న బంగారం ధర మెల్లి మెల్లిగా తగ్గుతుంది. పసిడి ప్రియులను ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1976.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో రూ.82.313గా నమోదైంది. ప్రస్తుతం హస్తీనా, భాగ్యనగరిలో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో మేలిమి బంగారం ధర తులానికి రూ. 150 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల పుత్తడి ధర రూ. 60,930గా కనిపిస్తోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. బంగారం ధర రోజు రోజుకూ తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం ఆకాశం పైపు చూస్తున్నాయి. ఢిల్లీలో వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ. 72, 800 వద్ద పలుకుతోంది.

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. పసిడి ధరలు ఢిల్లీలో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువగా ఉంటాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 60,760గా ట్రేడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700గా నమోదైంది. ఇక భాగ్యనగరిలో వెండి ధరలు మాత్రం ఎండల్లెక్క భగభగ మండుతున్నాయి. కిలో వెండి ధర రూ. 800 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 77, 600గా పలుకుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో ఏదైనా బంగారపు వస్తువులు చేయించుకునే వారికి మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరల నిర్ణయం ఉంటుంది కాబట్టి.. తనిఖీ చేసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed