గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న వెండి ధర నేడు అమాంతం పెరిగింది. ఇక బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. మరి నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధర నేడు స్థిరంగా కొనసాగింది. ఇక వారం రోజులుగా తగ్గుతూ వస్తోన్న వెండి ధర మాత్రం ఈ రోజు కొద్దిగా పెరిగంది. నేడు దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా ఉంది. పది రోజులుగా.. రోజు ఎంతోకొంత తగ్గుతూ వస్తోన్న బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా కొనసాగింది. నేడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంగారం ధర ఇలా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,000గా ఉండి.. నిన్నటి ధరలే కొనసాగాయి. అలానే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,730 వద్ద స్థిరంగా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.52,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,880గా ఉంది.
గత వారం రోజులుగా పసిడితో పాటు తగ్గుతూ వస్తోన్న వెండి ధర నేడి పెరిగింది. దేశీయ మార్కెట్లో నేడు వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. దేశీయ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.68,800కు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర నేడు రూ.72,000గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో కిలో వెండి రేటు రూ.68,880గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర మాత్రం క్రమంగా తగ్గుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో.. బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,824 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంపుపై అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‍లో గోల్డ్ రేట్లు మారుతున్నాయి. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణంతో పాటు రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమవుతుండడం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు.