బంగారం అంటే ఇష్టపడని భారతీయ మహిళ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అయితే పసిడి ధర మాత్రం.. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధర.. నేడు పెరిగింది. ఆ వివరాలు..
అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు, యుద్ధం, డాలర్ విలువలో మార్పు.. తదితర కారణాల వల్ల.. ఇటీవలే గరిష్ఠ స్థాయులకు చేరిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. బంగారం ధర పతనం కేవలం మూడు రోజులకే పరిమితమైంది. బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది. దాంతో బంగారం కొనాలనుకునేవారు వెనకంజ వేస్తున్నారు. పసిడి ధర ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక.. అసలు పసిడి కొనాలా వద్దా అనే అనుమానంతో ఊగిసలాడుతున్నారు. ఇక నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. ఆ వివరాలు..
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌కు చెందిన బంగారం 10 గ్రాముల ధర రూ.200 మేర పెరిగింది. 22 క్యారెట్ పసిడి ధర రూ.54,700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర తులం మీద రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.59,670 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం పుత్తడి ధర పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం రేటు తులం మీద రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.54,850 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం తులం మీద రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.59,820గా ఉంది.
నేడు బంగారం రేటు పెరగ్గా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.73,000 పలుకుతోంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి ధర క్రితం సెషన్‌లో రూ.300 తగ్గగా ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.75,700 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు ప్రధానంగా స్థానికంగా విధించే వివిధ రకాల పన్నులు, ఇతర సర్వీసు ఛార్జీలు కారణంగా మారతాయి.