బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. రెండు రోజులు తగ్గితే.. రెండు రోజుల తగ్గడం.. మళ్లీ పెరగడం ఇదే తంతు కొనసాగుతోంది. నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. ఆ వివరాలు..
బంగారం ధరలు స్థిరంగా ఉండవు. బులియన్ మార్కెట్లపై గ్లోబల్ అంశాలు, డాలర్ విలువ వంటివి ప్రధానంగా ప్రభావం చూపుతాయి. ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే, అక్షయ తృతీయ పండగ తర్వాత రెండు మూడు రోజులు తగ్గినట్లు కనిపించిన బంగారం ధర మళ్లీ పుంజుకుంటోంది. అమెరికా డాలర్ విలువ పతనమవుతుండడంతో బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. దీంతో పసిడి ధర మళ్లీ పైపైకి వెళ్తోంది. తాజాగా 10 గ్రాముల గోల్డ్ ధర మళ్లీ రూ.61 వేలకు చేరింది.. తులం మీద ఎంత పెరిగింది అంటే..
నేడు హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.55,950 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ.110 పెరిగింది. ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ బంగారం ధర రూ.61,040 స్థాయికి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ బంగారం రేటు 10 గ్రాముల మీద రూ.100 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర రూ.56,100 వద్ద ట్రేడవుతుంది. అలానే ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు రూ.110 పెరిగి రూ.61,190కి చేరింది.
బంగారంతో పోలిస్తే.. నేడు వెండి రేటు భారీగా దిగి వచ్చినంది. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన వెండి ధర నేడు.. కిలో మీద ఏకంగా రూ.500 మేర పడిపోయింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.500 తగ్గి ప్రస్తుతం రూ.80,200 పలుకుతోంది. ఇక ఢిల్లీలో కూడా కిలో వెండి రేటు రూ.200 మేర తగ్గి ప్రస్తుతం రూ. 76,500 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువ, వెండి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందుకు ఆయా మెటల్స్‌పై స్థానికంగా ఉండే పన్నులు, ఇతర అంశాలు కారణమవుతాయి.