బంగారం ధరలో హెచ్చు తగ్గులు చూసి.. పసిడి కొనాలనుకుని.. ఆగిపోయారా.. అయితే ఇప్పుడు వెంటనే కొనేయండి అంటున్నారు మార్కెట్ నిపుణులు. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పడిపోయింది. ఆ వివరాలు..
బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. బంగారం రేటు దిగి వస్తోంది. ఆదివారం నుంచి పసిడి ధర స్థిరంగా ఉండగా.. నేడు అనగా మంగళవారం పడిపోయింది. 24 క్యారెట్ బంగారం తులం ధర కూడా 60 వేల లోపే ఉంది. 22 క్యారెట్ బంగారం ధర కూడా దిగివస్తోంది. వరుసగా మూడు సెషన్లలో బంగారం ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం చర్చకు రావడంతో.. ఆ ప్రభావం పసిడి ధర మీద పడింది. మరి నేడు బంగారం ధర తులం మీద ఎంత తగ్గింది.. హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో తులం పసిడి ధర ఎలా ఉంది అంటే..
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.140 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ పసిడి తులం ధర రూ.54,710 మార్క్ వద్ద కొనసాగుతోంది. అలానే స్వచ్ఛమైన 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. 24 క్యారెట్ బంగారం తులానికి రూ.150 మేర దిగివచ్చి ప్రస్తుతం రూ.59,690 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు తగ్గింది. నేడు హస్తినలో 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.54,900గా ఉండగా.. మరోవైపు.. 24 క్యారెట్ మేలిమి బంగారం రూ.110 తగ్గి తులం రేటు రూ.59,880 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం ఆటలోనే వెండి ధర కూడా దిగి వస్తోంది. గత రెండు రోజులుగా వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు వరుసగా నాలుగు రోజుల్లో రూ.1800 మేర పెరగ్గా.. ఇవాళ మాత్రం కాస్త బ్రేకిచ్చి తగ్గింది. ఢిల్లీలో నేడు కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.73, 300 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి.