పసిడి ధరలు సామాన్యులకు అర్థం కావడం లేదు. పండుగలు, శుభాకార్యాల వేళ బంగారం కొందామంటే.. భారీగా పెరుగుతోంది. మిగతా సమాయాల్లో దిగి వస్తోంది. ఇక తాజాగా వరుసగా రెండో రోజు బంగారం ధర దిగి వచ్చింది. మరి నేడు తులం బంగారం ధర ఎంత ఉంది అంటే..
బంగారం కొనాలనుకునే వారు అయోమయంలో ఉన్నారు. ధర వరుసగా పెరుగుతూనే ఉంటుంది.. లేదంటే తగ్గుతుంది. హమ్మయ్యా పసిడి ధర దిగి వస్తుంది కదా.. మరి కొద్ది రోజులు చూద్దాం.. ఆ తర్వాత కొందామనుకునేలోపే.. భారీగా ధర పెరిగి.. షాక్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే సీన్ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర.. నిన్నటి నుంచి తగ్గుతూ వస్తోంది. నేడు కూడా బంగారం ధర పడిపోయింది. కొన్ని రోజుల క్రితం బంగారం ధర రికార్డు గరిష్టాలకు, ఆల్ టైం హైకి చేరిన సంగతి తెలిసిందే. వరుసగా పెరిగిన గోల్డ్ ధరకు తాజాగా బ్రేకులు పడ్డాయి. నిన్నటి నుంచి అటు అంతర్జాతీయంగా.. ఇటు దేశీయంగా బంగారం ధర దిగి వస్తోంది. మరి నేడు బంగారం ధర ఎంత తగ్గింది.. తులం ధర ఎలా ఉంది వంటి వివరాలు..
ఇక నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని న్యూఢిల్లీల్లో బంగారం ధర ఎంత తగ్గింది.. తులం రేటు ఎంత ఉంది అంటే.. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద 100 రూపాయలు దిగి వచ్చింది. ఇక ప్రస్తుతం నగరంలో 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.55,800కు చేరింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల మీద 110 రూపాయలు తగ్గి.. తులం ధర ప్రస్తుతం రూ.60,870 వద్ద కొనసాగుతోంది. నిన్న అనగా శుక్రవారం నాడు ఇది రూ.380 మేర పడిపోయింది. ఇక ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పడిపోయింది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములక 100 రూపాయలు తగ్గి రూ. 55,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.110 పతనమై రూ.61,020 మార్కుకు చేరింది.
ఇక బంగారం ధర దిగి వస్తుండగా.. వెండి ధర మాత్రం పెరుగుతూ ఉంది. ఇక తాజాగా ఢిల్లీలో వెండి ధర కిలో మీద రూ. 110 పెరిగి రూ.76,600కు చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో వెండి ధర నేడు ఒక్కరోజులో రూ.200 ఎగబాకి ప్రస్తుతం కిలోకు రూ.80,200 మార్కు వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ కూడా బంగారం ధర దిగి వస్తోంది. మరి ఇంది ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.