పసిడి ప్రియులకు చేదు వార్త. గత రెండు రోజులూ తగ్గుతూ వచ్చిన బంగారం మళ్ళీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఊపందుకుంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి ఇది కాస్త చేదు వార్తే. డిమాండ్ తగ్గడం వల్ల బంగారం ధరలు పడిపోతూ వచ్చాయి. ఈ రెండు రోజులుగా ధరలు పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద రూ. 770, 22 క్యారెట్ల బంగారం రూ. 710 తగ్గింది. ఇంకా తగ్గుతుందనుకుంటే ఉన్నట్టుండి మళ్ళీ పెరిగింది. గడిచిన పది రోజుల్లో బంగారం 5 సార్లు పెరగ్గా.. 3 సార్లు మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ల బంగారం మే 1, 6, 7 తేదీలు మూడు రోజులూ కలిపి రూ. 860 తగ్గితే.. మిగతా రోజులన్నీ కలిపి రూ. 1710 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. మూడు రోజులో కలిపి రూ. 940 తగ్గగా.. మిగతా రోజులన్నీ కలిపి రూ. 1870 పెరిగింది. మళ్ళీ బంగారం కొనేవారి సంఖ్య పెరుగుతుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2023 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మొన్నటివరకూ ప్రతికూల పరిస్థితులతో పోరాడిన బంగారం.. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతుంది. దేశీయంగా కూడా పసిడి మళ్ళీ ఊపందుకుంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,600 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ. 110 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం అయితే రూ. 120 పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 6,163 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 6,175 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 25.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేశీయంగా మాత్రం వెండికున్న డిమాండ్ తగ్గలేదు. మే 6న రూ. 1300 తగ్గిన వెండి.. నిన్న రూ. 300 పెరిగింది. దీంతో ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 82,700 వద్ద కొనసాగుతోంది.