బంగారం అంటే ఇష్టపడని వారుండరు. అదే భారత్ లో అయితే బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు లెక్కలు మారాయి. భారత్ లో బంగారం డిమాండ్ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి.
బంగారం అంటే ఇష్టపడని వారుండరు. కానీ, చాలా మంది వారి స్థోమతకు మించి ధరలు ఉంటాయని దాని జోలికి పోరు. ధర ఎంతున్నా కూడా బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గేది కాదు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. భారతదేశంలో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 2023 మొదటి క్వార్టర్ లో బంగారం డిమాండ్ కేవలం 112.5 టన్నులు మాత్రమే ఉంది. అంటే 2023 జనవరి- మార్చి మధ్య భారత్ లో బంగారం డిమాండ్ 17 శాతం తగ్గిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ప్రకారం చూసుకుంటే భారత్ లో బంగారం ధర బాగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేశారు. వారు అనుకున్నట్లుగానే పసిడి ధరలు దిగొచ్చాయి.
ఆర్థిక సూత్రాల ప్రకారం.. ఏ వస్తువుకైనా డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువగా ఉంటే కచ్చితంగా దాని ధర తగ్గిపోతుంది. ఇప్పుడు బంగారం విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆదివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శనివారం రూ.57,200గా ఉండగా.. ఆదివారం రూ.700 తగ్గి రూ.56,500కి చేరింది. అంటే 22 క్యారెట్ బంగారం గ్రాము ధర రూ.5,650గా ఉంది. ఇంక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 తగ్గి.. రూ.61,640కి చేరింది. అంటే 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.6,164గా ఉంది. భారత్ లోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి.
పసిడి ప్రియులకు ఇదే మంచి సమయంగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డిమాండ్ తక్కువ ఉన్న సమయంలోనే బంగారం కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. అలాంటప్పుడే బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాకుడాం బంగారాన్ని పెట్టుబడి వనరుగా కూడా భావిస్తారు. అలా చూసినా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం మంచిదని తెలియజేస్తున్నారు. మీరు షాపులోనే కాదు.. ఆన్ లైన్ లో డిజిటల్ గోల్డ్ ని కూడా కొనుగోలు చేయచ్చు. తగ్గుతున్న డిమాండ్ లెక్కల ప్రకారం భవిష్యత్ లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.