బంగారం కొనాలనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే కొనుక్కోవాలి. అప్పుడే లాభం అనేది ఉంటుంది. రేటు పెరిగిన తర్వాత కొంటే అనవసరంగా కొన్నామే అని బాధపడాల్సి వస్తుంది. మరి ఇవాళ కొంటే లాభమా? నష్టమా? అనేది తెలుసుకోండి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. ప్రస్తుతం అంటే మే 4న ఉదయం 7:22 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 29.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో మార్పులు వచ్చాయి. గడిచిన పది రోజులుగా బంగారం ధరలు చూసుకుంటే.. ఏప్రిల్ 24న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 55,650 ఉంది. 25న రూ. 200 పెరుగుదలతో రూ. 55,850కి చేరుకున్న బంగారం మరుసటి రోజు రూ. 100 పెరుగుదలతో రూ. 55,950కి చేరుకుంది. ఏప్రిల్ 27న స్థిరంగా ఉన్న బంగారం 28న రూ. 200 తగ్గింది. 29న రూ. 100 పెరగడంతో ఏప్రిల్ నెలాఖరుకి 55,850కి చేరుకుంది. మే 1 న రూ. 150 తగ్గడంతో 55,700కి చేరుకుంది.
మే 2న స్థిరంగా ఉన్న బంగారం మే 3న భారీగా పెరిగింది. ఏకంగా రూ. 800 పెరిగింది. దీంతో ఇవాళ అంటే మే 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,500 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం అయితే.. 10 రోజుల క్రితం 60 వేల దగ్గర 61 వేల పైకి ఎగబాకింది. ఏప్రిల్ 24న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60,710 ఉండగా.. 25న రూ. 220 పెరుగుదలతో 60,930కి చేరుకుంది. 26న కూడా రూ. 110 పెరిగింది. దీంతో రూ. 61,040కి చేరుకుంది. ఏప్రిల్ 28న రూ. 220 తగ్గగా.. 29న రూ. 110 పెరిగింది. 30న మాత్రం స్థిరంగా ఉన్న బంగారం మే 1న రూ. 170 తగ్గింది. మే 2న స్థిరంగా ఉన్న బంగారం 3న మాత్రం భారీగా పెరిగింది. ఏకంగా రూ. 880 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. గడిచిన 10 రోజుల్లో 4 సార్లు తగ్గి మళ్ళీ 4 సార్లు పెరిగాయి. ఏప్రిల్ 24న కిలో వెండి రూ. 80 వేలు ఉండగా.. 25న రూ. 700 పెరిగింది. 26న రూ. 500 తగ్గగా.. 28 రూ. 200 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 80 వేలకు చేరుకుంది. ఏప్రిల్ 29న రూ. 400 పెరిగింది. 30న స్థిరంగా ఉన్న వెండి ధర మే 1న రూ. 200 తగ్గింది. మే 2న రూ. 300 పెరగడంతో రూ. 80,500కి చేరుకుంది. మే 3న ఏకంగా రూ. 1300 పెరిగింది. దీంతో ఇవాళ కిలో వెండి రూ. 81,800 వద్ద కొనసాగుతోంది. మీరు సరిగ్గా గమనిస్తే ఏప్రిల్ 4న కిలో వెండి రూ. 77,800 ఉంది. ఏప్రిల్ 5న రూ. 80,700 అయ్యింది. ఆ తర్వాత నుంచి రూ. 80 వేలకు ఎక్కడా తగ్గలేదు. అయితే రూ. 81 వేలు, లేదంటే రూ. 80 వేల చిల్లర వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న రూ. 69,200 ఉన్న మార్చి నెలలో 4 సార్లు తగ్గింది. అప్పటి నుంచి కూడా పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం వెండి కొనాలి అనుకుంటే గనుక రూ. 80 వేలకు చేరుకున్నప్పుడు కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అంతకు మించి తగ్గదని అంటున్నారు. అలానే బంగారం కూడా. ఏప్రిల్ 3న 22 క్యారెట్ల బంగారం రూ. 54,700 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం రూ. 59,670 గా ఉంది. ఏప్రిల్ 4న 22 క్యారెట్ల బంగారం రూ. 55,300కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 60,330కి చేరుకుంది. ఏప్రిల్ 5న 24 క్యారెట్ల బంగారం రూ. 61,360కి చేరుకుంది. ఆ తర్వాత ఎన్ని సార్లు తగ్గినా గానీ 24 క్యారెట్ల బంగారం అనేది రూ. 60 వేల కంటే కిందకి పడిపోలేదు. గత నెల నుంచి రూ. 60 వేలు, రూ. 61 వేలు ఇలా ధరలు హెచ్చుతగ్గులు అనేవి ఉంటున్నాయి. బంగారం కొనాలి అనుకుంటే గనుక రూ. 60 వేలకు పడినప్పుడు కొనుక్కోవడం మంచిదని అంటున్నారు. అంతకంటే దిగడం ఉండదని చెబుతున్నారు. ఇప్పుడు బంగారం కొంటే మంచిదే కానీ తగ్గిన తర్వాత కొంటే ఇంకా మంచిదని అంటున్నారు.