పసిడి ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పతనమవుతోంది. ఇటువంటి సమయంలో బంగారం కొనడం మంచిదేనా?
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గింది. అంతేకాదు ఇకపై కూడా తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మే 2,3 వ తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్ ఉంది. ఈ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కారణంగా ట్రేడర్స్ గోల్డ్ కొనుగోలులు ఆపేశారు. ఈ వారాంతంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచే అంచనాల నేపథ్యంలో డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు మించి ఉండడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికాలో బ్యాంకింగ్ రంగం కుదేలవడంతో ఏప్రిల్ నెలలో బంగారం 1 శాతం మేర పెరిగింది. దీంతో బంగారం మీద పెట్టుబడులు పెట్టడం సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మే 2వ తేదీ ఉదయం 07:30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర రూ. 1983 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 24.91 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా కూడా ఇవాళ బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం మే 2న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 55,850 ఉంది. ఇవాళ 10 గ్రాముల వద్ద రూ. 150 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 170 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల బంగారం రూ. 60,930 ఉండగా.. ఇవాళ రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. గడిచిన పది రోజులుగా బంగారం ధరలు పరిశీలిస్తే.. 22 24 క్యారెట్ల బంగారం ఏప్రిల్ 22న 60,820 ఉండగా.. ఏప్రిల్ 23, 24 తేదీల్లో స్వల్పంగా తగ్గి రూ. 60,710 కి చేరుకుంది.
ఏప్రిల్ 25, 26 తేదీల్లో రూ. 330 పెరుగుదలతో రూ. 61,040కి చేరుకుంది. ఏప్రిల్ 27న స్థిరంగా ఉన్న బంగారం.. ఏప్రిల్ 28న రూ. 220 తగ్గింది. ఏప్రిల్ 29న రూ. 110 పెరుగుదలతో 60,930కి చేరుకోగా.. ఏప్రిల్ 30న స్థిరంగా ఉంది. మే 1న ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 170 తగ్గి రూ. 60,760కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం కూడా ఇలానే తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. గడిచిన పది రోజుల్లో 5 సార్లు బంగారం తగ్గగా.. 3 సార్లు పెరిగింది. ఈ పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 750 తగ్గగా.. రూ. 400 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం అయితే 10 రోజుల్లో రూ. 830 తగ్గగా.. రూ. 440 పెరిగింది. ప్రస్తుతానికి అయితే 24 క్యారెట్ల బంగారం రూ. 60,760 వద్ద.. 22 క్యారెట్ల బంగారం రూ. 55,700 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధర కూడా ఇవాళ దిగి వచ్చింది. ఏప్రిల్ 22న రూ. 900 పెరుగుదలతో కిలో ధర రూ. 80,400కి చేరుకున్న వెండి.. ఏప్రిల్ 24న రూ. 400 తగ్గడంతో రూ. 80 వేలకు చేరుకుంది. ఏప్రిల్ 25న రూ. 700 పెరగడంతో రూ. 80,700 అయ్యింది. ఏప్రిల్ 26, 28 తేదీల్లో మళ్ళీ రూ. 700 తగ్గి రూ. 80 వేలకు చేరుకుంది. ఏప్రిల్ 29న రూ. 400 పెరిగి.. మే 1న రూ. 200 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బంగారం కొనొచ్చా అంటే కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచాలని చూస్తోంది. కాబట్టి డాలర్ పుంజుకుని.. బంగారం ధరలు పతనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మే నెల పెళ్లిళ్ల సీజన్ కాబట్టి బంగారం ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాబట్టి పెరిగేలోపే కొనుక్కుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.