బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో డాలర్ పుంజుకుంది. ఈ కారణంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం ఎంత ఉందంటే?
బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా బంగారం ధరలు పతనమవుతున్నాయి. అమెరికా జీడీపీ డేటా ఊహించిన దాని కంటే మెరుగైన గణాంకాలు నమోదు చేయడం, అంతర్జాతీయంగా ధరలు పడిపోవడం వల్ల బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా జీడీపీ డేటాతో పాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన కారణంగా డాలర్ పుంజుకోవడం, బాండ్ ఈల్డ్స్ కి గిరాకీ పెరగడం, బంగారం మీద పెట్టిన పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లించడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పతనమవుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1946.67 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1,60,726.42 వద్ద కొనసాగుతోంది. గ్రాము స్పాట్ గోల్డ్ ఐతే రూ. 5,167.47 వద్ద కొనసాగుతోంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1956 డాలర్ల వద్ద కొనసాగింది. ఇవాళ 10 డాలర్లు మేర పడిపోయింది. మన కరెన్సీ ప్రకారం రూ. 825 తగ్గింది. దేశీయంగా కూడా బంగారం ధరలు పడిపోయాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,800 వద్ద ఉండగా ఇవాళ రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. రూ. 55,650 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాముల మీద రూ. 160 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60,870 ఉండగా.. ఇవాళ రూ. 60,710కి పడిపోయింది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే తగ్గింది. వరుసగా ఐదోసారి వెండి ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 23.32 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1925.66గా ఉంది. నిన్న ఔన్సు వెండి 22.84 డాలర్ల వద్ద అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1889.62 వద్ద ఉంది. కిలో వెండి ఐతే రూ. 61,911.37 వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ గా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెండి ధర కూడా పతనమైంది. దేశీయంగా కూడా వెండి ధర పతనమవుతూ వస్తోంది. ఈ 5 రోజుల్లో రూ. 2800 తగ్గింది. ఈ నెల మే 1 నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు పెరగగా.. 13 సార్లు తగ్గింది. 8 రోజుల్లో రూ. 5300 పెరిగితే.. 13 రోజుల్లో రూ. 9200 తగ్గింది.
మే నెలలో అత్యధికంగా కిలో వెండి రూ. 83,700 ఉండగా.. ఇవాళ రూ. 76,200గా ఉంది. రూ. 7500 తగ్గింది. హెచ్చుతగ్గుల వ్యత్యాసం రూ. 3900 ఉంది. అంటే ఈ నెలలో రూ. 3,900 తగ్గినట్టు. నిన్న కిలో వెండి మీద రూ. 300 తగ్గింది. బంగారంపై ఉన్న పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లించడం కారణంగా బంగారం ధరలు పతనమయ్యాయని.. ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. సోమవారానికి దేశీయంగా కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.