అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. దేశీయంగా కూడా ఇవాళ దిగొచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం, వెండి కొనడం లాభమేనా? ఆగితే మంచిదా? ఈ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? ఇవాళ ధరలు ఎలా ఉన్నాయి?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా విదేశీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పసిడి ధరలు పతనమవుతున్నాయి. 2023 డాలర్లు వద్ద ఉండాల్సిన ఔన్సు స్పాట్ గోల్డ్ ఇవాళ 1944 డాలర్లకు పతనమైంది. ఏకంగా 79 డాలర్లు మేర బంగారం తగ్గింది. మన కరెన్సీ ప్రకారం రూ. 6,535కు పడిపోయింది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ రూ. 1956 డాలర్ల వద్ద కొనసాగింది. ఇవాళ 12 డాలర్లు మేర తగ్గింది. మన కరెన్సీ ప్రకారం రూ. 992 తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 28 గ్రాముల స్పాట్ గోల్డ్ 1944 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1,60 వేల వద్ద కొనసాగుతోంది. గ్రాము బంగారం విదేశీ మార్కెట్లో 62.55 డాలర్లు ఉండగా.. మన కరెన్సీ ప్రకారం రూ. రూ. 5,174 గా ఉంది.
దేశీయంగా కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,250 ఉండగా ఇవాళ రూ. 450 తగ్గింది. దీంతో ప్రస్తుతం బంగారం రూ. 55,800 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల మీద రూ. 490 తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61,360 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 60,870 వద్ద కొనసాగుతోంది.ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 22.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1889.62 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ఐతే రూ. 60,787.17 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న గ్లోబల్ మార్కెట్లో 28 గ్రాముల వెండి 22.96 డాలర్లు వద్ద ఉంటే.. ఇవాళ 22.84 డాలర్లకు పడిపోయింది. 0.12 డాలర్ తగ్గింది. మన కరెన్సీ ప్రకారం రూ. 9.93 తగ్గింది.
నిన్న గ్లోబల్ మార్కెట్లో కిలో వెండి రూ. 739 డాలర్లు ఉంటే.. ఇవాళ 735 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి మీద 4 డాలర్లు పతనమైంది. మన కరెన్సీ ప్రకారం రూ. 330 తగ్గింది. గ్లోబల్ గా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెండి ధర కూడా పతనమైంది.దేశీయంగా కూడా వెండి ధర భారీగా పతనమైంది. దేశీయంగా కూడా వెండి ధర పతనమవుతోంది. గత నాలుగు రోజులుగా చూసుకుంటే వెండి ధర భారీగా పడిపోతూ వచ్చింది. మే 22 నుంచి 25 వరకూ రూ. 2500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 1000 తగ్గింది. నిన్న కిలో వెండి రూ. 77,500 వద్ద ఉండగా ఇవాళ రూ. 76,500 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తగ్గిన ధరలకే బంగారం, వెండి కొనుగోలు చేసినా మళ్ళీ ఆ ధరలు పెరుగుతాయి కాబట్టి లాభం ఉంటుందని అంటున్నారు.