గత పది రోజుల నుంచి బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. మధ్యలో ఒకరోజు పెరగడం చూసాం. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం పతనమవ్వడం, మళ్ళీ పుంజుకునే ప్రయత్నం జరగడం చూస్తున్నాం. గ్లోబల్ మార్కెట్ కి తగ్గట్టు దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
బంగారం కొనాలనుకుంటున్నారా? ఐతే కొనే ముందు ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని కొనాలో వద్దో అన్నది నిర్ణయించుకుంటే మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1956.83 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ఉదయం 1973 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన బంగారం 17 డాలర్లు పతనమైంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1406 తగ్గింది. విదేశీ మార్కెట్లో ప్రస్తుతం 28 గ్రాముల స్పాట్ గోల్డ్ రూ. 1,61,869 ఉండగా.. గ్రాము గోల్డ్ రూ. 5,204 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే బంగారం గ్లోబల్ మార్కెట్లో రూ. 5,258 వద్ద కొనసాగింది. దేశీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో 5 సార్లు దిగొచ్చిన పసిడి ధరలు 3 సార్లు పెరిగాయి.
మే 17, 18, 19, 22, 23 తేదీల్లో తగ్గిన బంగారం మిగతా తేదీల్లో పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56 వేలు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61,100 వద్ద ఉంది. ఇవాళ 10 గ్రాముల మీద 22 క్యారెట్ల బంగారం రూ. 250, 24 క్యారెట్ల బంగారం రూ. 260 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 56,250 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 61,360 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఔన్సు స్పాట్ వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో 22.96 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
అక్కడి మార్కెట్లో కిలో వెండి 739 డాలర్లు పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 14 డాలర్లు తగ్గింది. మన కరెన్సీ ప్రకారం రూ. 1158 తగ్గినట్టు. అక్కడ 28 గ్రాముల వెండి రూ. 1901 ఉండగా, కిలో వెండి రూ. 61,146 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా కూడా వెండి ధర తగ్గింది. గత మూడు రోజులుగా వెండి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. మే 22, 23, 24 తేదీల్లో కిలో వెండి మీద రూ. 1500 తగ్గింది. నిన్న రూ. 500 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొనడం కంటే ఒకటి, రెండు రోజులు ఆగి కొంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వెండి కూడా ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది.