వారం రోజుల క్రితం వరుసగా మూడుసార్లు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పెరిగినట్టే పెరిగి మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఎంత ఉందంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజుల క్రితం భారీగా పతనమైన బంగారం మళ్ళీ పెరుగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1973.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక గ్రాము 63.47 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన కరెన్సీ ప్రకారం ఒక గ్రాము స్పాట్ గోల్డ్ రూ. 5,258.77 వద్ద కొనసాగుతోంది. 28 గ్రాముల గోల్డ్ ఐతే రూ. 1,63,565.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారం పెరుగుతున్నప్పటికీ దేశీయంగా మాత్రం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు దిగి వచ్చాయి.
ఈ నెల 17, 18, 19 తేదీల్లో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం మే 20న పెరిగింది. ఆ తర్వాత రోజు స్థిరంగానే ఉన్నా 22, 23 తేదీల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. మే 17, 18, 19 తేదీల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద రూ. 1040 తగ్గగా.. 20న రూ. రూ. 550 పెరిగింది. మే 22న రూ. 10 తగ్గగా.. 23న రూ. 310 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 61,100 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే 17, 18, 19 తేదీల్లో రూ. 950 తగ్గగా.. 20న రూ. 500 పెరిగింది. 22, 23 తేదీల్లో రూ. 300 తగ్గింది. నిన్న రూ. 290 తగ్గడంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 56 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోనే కాకుండా దేశీయంగా కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 23.43 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి 753.12 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన కరెన్సీ ప్రకారం కిలో వెండి రూ. 62,374.31 వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి రూ. 1940.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రూ. 78 వేల వద్ద కొనసాగుతోంది. మే 17, 18, 19 తేదీల్లో రూ. 800 తగ్గిన వెండి మే 20న ఒక్కసారిగా రూ. 1000 పెరిగింది. మే 21న స్థిరంగా ఉన్న వెండి.. 22న రూ. 400 తగ్గగా, 23న రూ. 600 తగ్గింది.