అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మళ్ళీ ఊపందుకుంది. గత కొన్ని రోజుల క్రితం పతనావస్థకు చేరిన బంగారం మళ్ళీ పెరుగుతుంది. మరి దేశీయ మార్కెట్లో దీని ప్రభావం ఎంత ఉంది? బంగారం, వెండి ధరలు తగ్గాయా? లేదా? ఇవాళ మార్కెట్లో తులం బంగారం ఎంత ఉంది?
10 రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో 2033 డాలర్లు ఉన్న ఔన్సు స్పాట్ గోల్డ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. మే 19న 1955 డాలర్ల కనిష్ట స్థాయికి పతనమైన స్పాట్ గోల్డ్ మరుసటి రోజు నుంచి పుంజుకోవడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1977 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 28 గ్రాముల స్పాట్ గోల్డ్ మన కరెన్సీ ప్రకారం రూ. 1,63,798 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక గ్రాము స్పాట్ గోల్డ్ ధర రూ. 5,266 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దేశీయ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మే 17, 18, 19 తేదీల్లో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం మే 20న పెరిగింది.
మే 20న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద రూ. 500 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 550 పెరిగింది. దీంతో శనివారం నాడు 22 క్యారెట్ల బంగారం రూ. 56,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 61,420 వద్ద కొనసాగుతోంది. శనివారం నాటి ధరలే ఆదివారం కూడా కొనసాగాయి. ఆదివారం ఎలాంటి హెచ్చుతగ్గులు లేకపోవడంతో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 56,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 61,420 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర చూసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయంగా పెరుగుదల కనిపించింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి ధర 23.77 డాలర్లు ఉండగా.. కిలో వెండి 764 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన కరెన్సీ ప్రకారం విదేశీ మార్కెట్లో 28 గ్రాముల వెండి రూ. 1967 ఉండగా.. కిలో వెండి రూ. 63,260 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా వెండి స్థిరంగా ఉంది. మే 17, 18, 19 తేదీల్లో భారీగా పతనమైన వెండి మే 20న ఏకంగా రూ. 1000 పెరిగింది. మే 21న స్థిరంగా ఉంది. ఇవాళ కిలో వెండి రూ. 79 వేల వద్ద కొనసాగుతోంది.