పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి ఇది నిజంగా మంచి వార్తే. దేశీయంగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. 8 రోజులకు ముందు అంటే మే 12వ తేదీకి ముందు నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 2033 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం 56 డాలర్లకు క్షీణించింది. విదేశీ మార్కెట్లో మళ్ళీ బంగారం పుంజుకుంటోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ 1977 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ 8 రోజుల్లో సుమారు రూ. 4600 మేర పతనమైంది. ప్రస్తుతం 28 గ్రాముల స్పాట్ గోల్డ్ మన కరెన్సీ ప్రకారం రూ. 1,63,843 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక గ్రాము స్పాట్ గోల్డ్ ధర రూ. 5,267 వద్ద కొనసాగుతోంది. ఐతే దేశీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
మే 17, 18, 19 తేదీల్లో మూడు రోజులూ కలిపి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద రూ. 950 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద రూ. 1040 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 56,100 ఉండగా.. ఇవాళ రూ. 300 తగ్గుదలతో రూ. 55,800కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ఐతే నిన్న రూ. 61,200 ఉండగా రూ. 330 తగ్గుదలతో ఇవాళ రూ. 60,870కి చేరుకుంది. మరి బంగారం కొనడం లాభమేనా? అన్నది పరిశీలిస్తే.. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సు 1955 డాలర్ల వద్ద ఉండగా.. ఇవాళ అది 1977 డాలర్లకు ఎగబాకింది. మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కరోజులో మళ్ళీ 22 డాలర్లు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశం కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవాళ 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేల మార్కుకి చేరుకుంది. కాబట్టి ఇది మళ్ళీ రూ. 62 వేల మార్కుని దాటుతుందని అంటున్నారు. రూ. 63 వేల మార్కుని టచ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కొనుగోలు చేస్తే రూ. 3 వేల వరకూ లాభం పొందే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు వెండి కొనుగోలు చేస్తే కనిష్టంగా రూ. 6 వేల రూపాయలు లాభం పొందవచ్చునని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర సానుకూలంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పెరుగుతుంది. మన కరెన్సీ ప్రకారం విదేశీ మార్కెట్లో 28 గ్రాముల వెండి రూ. 1975 ఉండగా.. కిలో వెండి రూ. 63,509 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి మీద రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 78,000 వద్ద కొనసాగుతోంది. మే 5న కిలో వెండి గరిష్టంగా రూ. 83,700 పలికింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇవాళ కనిష్ట ధరకు పడిపోయింది. ఇప్పుడు వెండి కొనుగోలు చేసిన వారికి సుమారు రూ. 6 వేల లాభం పొందే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది అంతర్జాలంలో దొరికిన కొన్ని గణాంకాల ఆధారంగా ఇవ్వబడింది. బంగారం ధరలు పెరగొచ్చు, తగ్గొచ్చు. కాబట్టి కొనేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.