అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పతనమవుతోంది. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు తగ్గాయి. మే 12వ తేదీకి ముందు 2033 డాలర్ల వద్ద కొనసాగిన బంగారం ఒక్కసారిగా 24 డాలర్లకు పడిపోయింది. తాజాగా ఇప్పుడు 1955 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ 1955 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఏకంగా 78 డాలర్లు పతనమైంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ వారం రోజుల్లో సుమారు రూ. 6500 పతనమైంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సు 1984 డాలర్ల వద్ద కొనసాగింది. ఇంతలా తగ్గడం ఈ నెలలో ఇదే తొలిసారి. నిన్నటితో పోల్చుకుంటే 29 డాలర్లు పతనమైంది. దీంతో 28 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ. 1,61,900 వద్ద కొనసాగుతోంది. గ్రాము బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రూ. 5,205 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల బంగారం రూ. 52,050 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల మీద నిన్న రూ. 450 తగ్గగా.. ఇవాళ రూ. 200 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 56,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే బంగారం రూ. 56,300గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 490 తగ్గగా.. ఇవాళ రూ. 220 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా బంగారం బాటలోనే వెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 23 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మన కరెన్సీ ప్రకారం 28 గ్రాముల వెండి రూ. 1939గా ఉంది. అక్కడ కిలో వెండి రూ. 62,348 వద్ద ట్రేడ్ అవుతోంది. మన హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రూ. 78,100 వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి మీద రూ. 600 తగ్గగా ఇవాళ రూ. 100 తగ్గింది.
మే 1న 24 క్యారెట్ల బంగారం రూ. 60,760 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 55,700గా ఉంది. మే 5న గరిష్టంగా 24 క్యారెట్ల బంగారం రూ. 62,400 పలుకగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 57,200 పలికింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల రూ. 61,200కి పడిపోయింది. రూ. 62 వేలు పైనే ఉన్న గోల్డ్ రూ. 61 వేలకు చేరుకుంది. కాబట్టి మళ్ళీ గోల్డ్ 62 వేల మార్కుని ఖచ్చితంగా దాటుతుంది. కాబట్టి ఇప్పుడు కొనడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తగ్గే అవకాశం ఉంటే గనుక 24 క్యారెట్ల బంగారం రూ. 60,700 సమీపానికి చేరుకుంటుంది. కాబట్టి అప్పటి వరకూ ఆగినా మంచిదే.
ఇక 22 క్యారెట్ల బంగారం కూడా ఇలానే తగ్గుతుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 56,100కి పడిపోయింది. మళ్ళీ లేస్తే కనుక రూ. 57,200 మార్కుని ఖచ్చితంగా దాటుతుంది. కాబట్టి ఇప్పుడు బంగారం కొనడం మంచిదే. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉండవచ్చు. వెండి ఐతే మే 1న రూ. 80,200 ఉంది. మే 5న గరిష్టంగా రూ. 83,700 పలికింది. ఇప్పుడు కిలో వెండి రూ. 78,100 వద్ద కొనసాగుతోంది. ఈ నెలలో రూ. 5,600 తగ్గింది. కాబట్టి ఇప్పుడు వెండి కొన్నవారికి ఖచ్చితంగా తక్కువ రోజుల్లో రూ. 5 వేల నుంచి రూ. 6 వేల లాభం అయితే ఉంటుంది.