అంతర్జాతీయంగా బంగారం మరోసారి పతనమయ్యింది. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. మే 12కి ముందు 2033 డాలర్ల వద్ద కొనసాగిన గోల్డ్ ఆ తర్వాత ఒక్కసారిగా 24 డాలర్లకు పడిపోయింది. వారం తిరక్కముందే మరోసారి బంగారం పతనమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సు వచ్చేసి 1984 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ నెలలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. 28 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర భారతీయ కరెన్సీలో రూ. 1,63,565.99 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే బాగా పతనమైంది. గ్రాము బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రూ. 5,258 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల బంగారం రూ. 52,580 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల మీద రూ.450 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 490 తగ్గింది. దీంతో నిన్న రూ. 56,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల బంగారం రూ. 56,300కి చేరుకుంది. ఇక నిన్న రూ. 61,910 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇవాళ రూ. 61,420కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా పసిడి బాటలోనే తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 23.75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీయ కరెన్సీ ప్రకారం 28 గ్రాముల వెండి ధర రూ. 1955 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ. 62,833 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయంగా వెండి ధర తగ్గింది. రెండు రోజుల క్రితం స్థిరంగా కొనసాగిన వెండి ఇవాళ కిలో మీద రూ. 600 తగ్గింది. నిన్న రూ. 78,800 వద్ద ఉన్న కిలో వెండి రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.