అంతర్జాతీయంగా బంగారం మళ్ళీ పుంజుకుంటుంది. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న బంగారం ఇవాళ తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. మూడు రోజుల క్రితం పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మళ్ళీ పుంజుకుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2017 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రెండు రోజుల క్రితం 2011 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన స్పాట్ గోల్డ్ రెండు రోజుల్లో 6 డాలర్లు పెరిగింది. 28 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర భారతీయ కరెన్సీలో రూ. 1,65,988 వద్ద కొనసాగుతోంది. గ్రాము బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రూ. 5,336 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల బంగారం రూ. 53,360 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 56,640గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 61,790 వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 56,650 ఉండగా.. ఇవాళ రూ. 10 తగ్గింది. అలానే 24 క్యారెట్ల బంగారం మీద కూడా రూ. 10 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల బంగారం రూ. 61,800 ఉంది. ప్రస్తుతం గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5,664 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 6,179 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర ఐతే స్థిరంగానే ఉంది. గత మూడు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 24 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ఐతే 773 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన కరెన్సీ ప్రకారం విదేశీ మర్కెట్లో కిలో వెండి రూ. 63,595 వద్ద కొనసాగుతోంది. మన దేశీయ మార్కెట్లో హైదరాబాద్ లో కిలో వెండి రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.