అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా పతనమైంది. దేశీయంగా కూడా బంగారం ధరల్లో మార్పు ఉంటుందా? ప్రస్తుతం బంగారం ఎలా ఉంది?
పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించే విషయమే ఇది. ఎందుకంటే గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ స్థిరంగా ఉంది. పెరగలేదు, తగ్గలేదు. నిన్న ఉన్న రేట్లే ఇవాళ ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం బంగారం భారీగా పతనమైంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2033 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా.. ఇవాళ 2009 డాలర్లకు పడిపోయింది. ఏకంగా 24 డాలర్లు మేర తగ్గింది. భారత కరెన్సీ ప్రకారం 1971 రూపాయలు తగ్గినట్టు. భారత కరెన్సీ ప్రకారం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక గ్రాము ధర రూ. 5,308.57 వద్ద కొనసాగుతోంది. ఒక ఔన్సు అంటే 28 గ్రాముల స్పాట్ గోల్డ్ ఐతే రూ. 1,65,139.57 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో స్పాట్ గోల్డ్ ఐతే రూ. 53,08,013.56 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు బంగారం ధరల్లో ప్రభావం చూపుతున్నాయి. గత మూడు రోజులుగా దేశీయంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 56,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇవే రేట్లు కొనసాగాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత కరెన్సీ ప్రకారం ఔన్సు అనగా 28 గ్రాముల వెండి అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1971 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదే కిలో వెండి ఐతే రూ. 63,377 వద్ద కొనసాగుతోంది.
దేశీయంగా మాత్రం కిలో వెండి మీద రూ. 700 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 82,0000 వద్ద కొనసాగుతోంది. గరిష్టంగా వెండి మళ్ళీ 83 వేలకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వెండి కొనుగోలు చేయడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. ఎక్కువ శాతం మంది డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కారణంగా బంగారం డిమాండ్ అనేది తగ్గుతుంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా డిమాండ్ తగ్గడానికి మరొక కారణం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బంగారం ధరలు దిగొచ్చే అవకాశం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.