వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు బంగారం షాకిస్తుంది. మొన్న రెండు రోజులు తగ్గిన గోల్డ్ ధరలు ఇంకా తగ్గుతాయనుకుంటే పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం కొండెక్కి కూర్చుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల విషయంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2033 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే ఒక డాలర్ క్షీణించింది. ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు అనేవి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారానికి మళ్ళీ డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 56,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 56,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 61,850 వద్ద కొనసాగింది. నిన్న ట్రేడ్ ముగిసే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 280 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,695గా ఉంది. ఇక 24 క్యారెట్ల గ్రాము బంగారం రూ. 6,213 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 25.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 200 తగ్గగా.. ఇవాళ మాత్రం రూ. 200 పెరిగింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం రూ. 82,700 వద్ద కొనసాగుతోంది.