పసిడి ప్రియులకు బంగారం షాకిచ్చింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పుంజుకోవడంతో దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
మూడు రోజుల క్రితం వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఆశపడితే సడన్ గా పెరుగుదల కనిపించింది. ఈ రెండు రోజుల్లో బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2034 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులో ఏకంగా 11 డాలర్లు పెరిగింది. దేశీయంగా కూడా బంగారం ధర పెరిగింది. ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం ధరలపై ప్రభావం పడుతుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా తలెత్తుతున్న ఆందోళన నేపథ్యంలో బంగారానికి మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 56,700 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 61,850 వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 56,600 ఉండగా.. రూ. 100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 61,750 ఉండగా.. రూ. 100 పెరిగింది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన వెండి నిన్న స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 25.58 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉన్నప్పటికి దేశీయంగా రూ. 200 తగ్గింది. నిన్న రూ. 82,700 పలికిన కిలో వెండి ప్రస్తుతం రూ. 82,500 వద్ద కొనసాగుతోంది.